శనివారం 27 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 14, 2020 , 00:55:01

అంకిత భావంతో పనిచేయాలి

అంకిత భావంతో పనిచేయాలి

నారాయణపేట టౌన్‌ : మనో వికాస ప్రగ తి కేంద్రాలలో పని చేస్తున్న సిబ్బంది సేవా ధృక్పథంతో, అంకితభావంతో పని చేయాలని జెడ్పీ సీఈవో, డీఆర్‌డీవో కాళిందిని సూ చించారు. మనోవికాస ప్రగతి కేంద్రాలలో ప్రతి పిల్లవాడు వ్యతిగత పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గురువా రం పట్టణంలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో మక్తల్‌, మద్దూర్‌, దామరగిద్ద, కోస్గి, ఊట్కూ ర్‌ మండలాలకు చెందిన మనోవికాస ప్రగతి కేంద్రాల సిబ్బంది, కమిటీ సభ్యులు, ఫిజియోథెరపిస్టులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాళిందిని మాట్లాడుతూ మనోవికాస ప్రగతి కేంద్రాలలో 30 మంది హాజరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు గాలి, వెలుతురు వచ్చేలా చూడాలన్నారు. కేంద్రాలలో పిల్లలకు సం బంధించిన పరికరాలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. ముఖ్యంగా జిల్లాలో 0-14 సంవత్సరాలలోపు ఉన్న వారికి సర్జరీల నిమిత్తం వారి లిస్టును తయారు చేసి ఇవ్వాలన్నారు. కేంద్రాలలో జీవనోపాధులను గుర్తించి, వారికి జీవనోపాదులు కల్పించే విధంగా శిక్షణలు ఇవ్వాలని పేర్కొన్నారు. 18 సంవత్సరాలు పూర్తైన దివ్యాంగులకు జాబ్‌కార్డులు ఇప్పించి వారు చేయగలిగిన పనిని కల్పించాలన్నారు. ఈ సమావేశంలో డీపీఎం ఆనం దం, ఏపీఎం బాలచందర్‌, సీసీ అరుణ, వెంకట్‌రెడ్డి, ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo