మినియాపొలిస్, మార్చి 13: అమెరికాలో డెరెక్ చౌవిన్ అనే శ్వేతజాతి పోలీసు అధికారి జాత్యహంకారానికిబలైపోయిన నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ కుటుంబానికి 2.7 కోట్ల డాలర్ల (రూ.196 కోట్ల 26 లక్షలు) నష్టపరిహారం చెల్లించేందుకు మినియాపొలిస్ నగర కౌన్సిల్ అంగీకరించింది. పౌర హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఇదే అత్యధిక నష్టపరిహారమని ఫ్లాయిడ్ కుటుంబం తరఫు న్యాయవాది బెన్ క్రంప్ తెలిపారు. న్యాయపోరాటంలో తొలి విజయం సాధించామని, నేరస్థులకు శిక్ష కోసం ఇంకా పోరాడాల్సి ఉందని చెప్పారు.