బుధవారం 03 మార్చి 2021
Narayanpet - Feb 14, 2020 , 00:54:30

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

నారాయణపేట టౌన్‌ : ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి కృష్ణమాచారి అన్నారు. గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యాలయంలో శాలివాహన కుమ్మరి సంఘం సభ్యులతో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కులవృత్తుల పరికరాలకు సంబంధించి ప్రభుత్వం రూ. లక్ష వరకు రుణాలు మంజూరు చేస్తుందన్నారు. అందులో రూ. 80వేల వరకు రాయితీ సౌకర్యా న్ని కల్పించినట్లు తెలిపారు. మిగ తా రూ.20వేల సంబంధించి శాలివాహన సంఘం పేరుతో డీడీని తీసి వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు యాద య్య, సాయిలు, ఆంజనేయులు, మొగులప్ప, నవీన్‌, పరశురాం, మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo