శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Feb 14, 2020 , 00:41:01

కేజీబీవీ క్రీడా అకాడమీలపై దృష్టిసారించాలి

కేజీబీవీ క్రీడా అకాడమీలపై దృష్టిసారించాలి

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌: జిల్లాలోని కేజీబీవీ క్రీడా అకాడమీల శిక్షణపై ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీనివాస్‌ అన్నారు. గురువారం జిల్లాలోని నవాబ్‌పేట, హన్వాడ, సీసీ కుంట, కేజీబీవీల అకాడమీల కోచ్‌లు, పీఈటీలు, ఇన్‌చార్జ్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బాలికలకు కేజీబీవీ అకాడమీలు ఏర్పాటు చేశామని, కోచ్‌లు, పీఈటీలు, ఇన్‌చార్జిలు ప్రత్యేక దృష్టిసారించాలని కోరారు. విద్యార్థులకు క్రీడలకు సంబంధించిన నైపుణ్యాలను వెలికి తీయడానికి ప్రతినెలా పారామీటర్‌ టెస్ట్‌ నిర్వహించి క్రీడాకారిణుల పర్‌ఫార్మెన్స్‌, శిక్షణ ప్రత్యేకమైన క్రీడలనందు టెస్టులు నిర్వహించాలన్నారు. అందించే ఆహారం మీదనే క్రీడా ప్రతిభ ఉంటుందని, మెనూ ప్రకారం వారికి ప్రతి రోజు ఆహారం ఇచ్చే విధంగా పీఈటీలు శ్రద్ధ వహించాలన్నారు. క్రీడాకారులను వివిధ స్పోర్ట్స్‌ హాస్టళ్లలో ఎంపికయ్యే విధంగా శిక్షణ అందించాలని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించేలా క్రీడాకారులను తీర్చిదిద్దాలని సూచించారు. సమావేశంలో కేజీబీవీ అకాడమీల ఇన్‌చార్జిలు సునిల్‌కుమార్‌, ఖలీల్‌, కోచ్‌లు మహేశ్‌, ఫారూఖ్‌, జ్ఞానేశ్వర్‌, పీఈటీలు మమత, అర్చన, నాగలక్ష్మి, కార్యాలయ సిబ్బంది, జయశ్రీ, హరికుమార్‌  పాల్గొన్నారు.

VIDEOS

logo