పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా

రేవల్లి : మండలంలోని గౌరిదేపల్లి గ్రామ సమీపం లో ఉన్న యంజీకేఎల్ఐ లిప్ట్-3ని సుందరమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. బధవారం రిజర్వాయర్ కట్ట మధ్యలో చిన్నగుట్టపై నిర్మించిన శివాలయంలో శివలింగం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఆలయాన్ని రిజర్వాయర్ నీటికి ఎత్తు భాగంలో నిర్మించడం, ఆలయానికి రెండు వైపు లా నీళ్లు ఉండడం వల్ల ఇక్కడికి వచ్చేవారి ఎంతో ఆహ్లాదంగా ఉంటుందన్నారు.
ఆలయం చుట్టూ ఉన్న స్థలం లో పార్కు ఏర్పాటుకు కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. దీంతో ఇక్కడ సుందరమైన, ఆహ్లాదకరమైన పర్యాటక కేంద్రం గా అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రామానికి చెందిన నాయకులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించడం, నాలుగు రోజుల నుంచి ఆలయ ప్రతిష్ఠలో ఇక్కడికి వచ్చిన భక్తులకు సకలసౌకర్యాలు, నిత్యాన్నదానం ఏర్పాటు చేయ డం అభినందనీయమన్నారు. అనంతరం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను వాహనంలో వెళ్తూ పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ బంకల సేనాపతి, జెడ్పీటీసీ బోర్లభీమయ్య, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు నారాయణరెడ్డి, సర్పంచులు పార్వతమ్మ, జ్యోతిశ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ శ్రీశైలం యా దవ్, దీపికా ఇన్ఫ్రాటెక్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సురేందర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శేషిరెడ్డి, తిరుపతయ్య, రామకృష్ణ, కాళ్ల కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- హార్టికల్చర్ విధాన రూపకల్పనకు సీఎం కేసీఆర్ ఆదేశం
- పల్లా గెలుపుతోనే సమస్యల పరిష్కారం : మంత్రి ఎర్రబెల్లి
- వీడియో: పాత్రలో లీనమై.. ప్రాణాలు తీయబోయాడు..
- మహారాష్ట్రలో మూడో రోజూ 8 వేలపైగా కరోనా కేసులు
- 2021లో విదేశీ విద్యాభ్యాసం అంత వీజీ కాదు.. ఎందుకంటే?!
- అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించే చిట్కాలు..!
- నితిన్ వైపు పరుగెత్తుకొచ్చి కిందపడ్డ ప్రియావారియర్..వీడియో
- పార్వో వైరస్ కలకలం.. 8 కుక్కలు మరణం
- అక్రమంగా నిల్వ చేసిన కలప స్వాధీనం
- గోవధ ఘటనపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం