శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Feb 12, 2020 , 23:42:42

18న డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల ప్రారంభం

18న డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల ప్రారంభం

ఖిల్లాఘణపురం : ఈ నెల 18వ తేదీన మండలంలోని కర్నెతండా, గార్లబండతండా, ఈర్లతండాలలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించనున్నట్లు ఎంపీపీ కృష్ణానాయక్‌ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథులుగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ నెల 18వ తేదీన ఉదయం 9 గంటలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు. కావున టీఆర్‌ఎస్‌ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ప్రారంభోత్సవాలకు అన్ని ఏర్పాట్లను చేసినట్లు చెప్పారు. 

VIDEOS

logo