గురువారం 26 నవంబర్ 2020
Narayanpet - Feb 12, 2020 , 23:38:36

మండలాభివృద్ధికి నిరంతరం కృషి

మండలాభివృద్ధికి నిరంతరం కృషి

పెబ్బేరు : మండలాభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా నిరంతరం కృషి చేస్తానని ఎంపీపీ ఆవుల శైలజ అన్నారు. బుధవారం మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న మిషన్‌ భగీరథ పనుల వల్ల పలు సమస్యలపై అధికారులను సభ్యులు నిలదీశారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అంధించాలనే సంకల్పంతో ముందుకు వెళ్లుతుండగా అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు స్థానిక ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ గోవిందునాయుడు మాట్లాడుతూ మూడు నెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశానికి పూర్తిస్థాయి అధికారులు రాకపోతే గ్రామాల సమస్యలను ఎవరికీ చెప్పుకోవాలని ప్రశ్నించారు. వేసవిలో జూరాల కాల్వల మరమ్మతులు చేపట్టాలని ఆయన కోరారు. వ్యవసాయం, వైద్య ఆరోగ్య, సాగునీరు, ఉపాధి తదితర శాఖలకు సంబంధించిన పలు అంశాలపైన చర్చించారు. సమావేశానికి పూర్తిస్థాయిలో అధికారులు హాజరుకాకపోవడంతో ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పద్మ, వైస్‌ ఎంపీపీ బాలచంద్రారెడ్డి, ఎంపీడీవో చలపతి, మండల వ్యవసాయశాఖ అధికారి చంద్రమౌళి, వైద్యాధికారి సృజన, సర్పంచులు రమాదేవి, రవిందర్‌నాయుడు, వెంకటస్వామి, రాజవర్ధన్‌రెడ్డి, గోవిందమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.