ఆదివారం 07 మార్చి 2021
Narayanpet - Feb 12, 2020 , 00:21:14

దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం జోడించాలి

దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం జోడించాలి

నారాయణపేట, నమస్తే తెలంగాణ : కేసుల దర్యా ప్తు విషయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలని జిల్లా ఎస్పీ డాక్టర్‌ చేతన అన్నారు. రాబోయే సహకార ఎన్నికలకు పటిష్టమైన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావే శం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శాంతి భద్రత లు, నేరాల అదుపునకు తీసుకుంటున్న చర్యలు, కేసు ల పరిశోధన, పెండింగ్‌లో ఉన్న కేసులు, పోలీస్‌ కస్టడీ, బెయిల్స్‌, నేరస్థులను గుర్తించుట, ఎల్‌అండ్‌వో, పిటి కేసులు, రాబోయే సహకార సంఘాల ఎన్నికల కోసం ముందస్తు తీసుకోవలసిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు. రోడ్డు భద్రతా చర్యలలో భాగంగా ప్రజలకు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్‌ కళా బృందంచే షీ టీమ్స్‌, డ యల్‌ 100, నేను సైతం, కమ్యూనిటీ పోలిసింగ్‌ల పట్ల ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాలపై నిఘా ఉంచి వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. 100 కాల్స్‌ పట్ల వేగవంతంగా స్పందిం చాలని, అన్ని రికార్డులను సాంకేతికంగా ఆన్‌లైన్లో నమోదు చేయాలని సూచించారు. పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో తరచు గా నేరాలకు పాల్పడుతున్న నేరస్థుల జాబితా సిద్ధం చేసి పీడీ యాక్టు అమలు పరచాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మధుసూదన్‌రావు, సీఐలు సంపత్‌కుమార్‌, శంకర్‌, శివకుమార్‌, ఇఫ్తెకర్‌, ఎస్సైలు పాల్గొన్నారు. 

VIDEOS

logo