సోమవారం 08 మార్చి 2021
Narayanpet - Feb 12, 2020 , 00:20:22

విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

ఊట్కూర్‌ : విద్యాభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చిన్నపొర్ల జెడ్పీహెచ్‌ఎస్‌ ఆవరణలో సైన్స్‌ ల్యాబ్‌ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులకు ఘన స్వా గతం పలుకుతూ పుష్ప గుచ్ఛాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని మూడు ప్రభు త్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో సైన్స్‌ ల్యాబ్‌ల నిర్మాణం కోసం నిధులు మంజూరైనట్లు తెలిపారు. విద్యార్థులు లక్ష్య సాధనతో చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆశించారు. పది పరీక్షలను విద్యార్థులు తమ జీవితానికి తొలి మెట్టుగా భావించి మంచి ర్యాంకులు సాధించాలన్నారు. ఇంటర్‌ మీడియెట్‌ విద్యార్థుల సౌక ర్యార్థం బైపీసీ గ్రూపును అందుబాటులోకి తెచ్చామని, ఈ ఏడాది నుంచి మండల కేంద్రంలోనే వార్షిక పరీక్షలు నిర్వ హించేందుకు పరీక్షా కేంద్రాన్ని కూడా మంజూరీ చేయించామని తెలిపారు. పదో తరగతి పూర్తైన తర్వాత విద్యార్థులు పట్టణాల వైపు పరుగులు పెట్టకుండ స్థానిక జూనియర్‌ కళాశాలలో చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎల్కోటి లక్ష్మినారాయణరెడ్డి, జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్‌, సర్పంచ్‌ రవీందర్‌రెడ్డి, ఊట్కూర్‌ సర్పంచ్‌ సూర్య ప్రకాశ్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రవిప్రసాద్‌రెడ్డి, రవికుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ నారాయణరెడ్డి, హెచ్‌ఎం విజయలక్ష్మి, మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, శివరామరాజు, ఈశ్వర్‌యాదవ్‌, జజ్జల్‌ చాంద్‌పాషా, అనీల్‌రెడ్డి, శ్రీశైలం, సలీం, షకీల్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo