విండో’ ఎన్నికలకు ఏర్పాట్లు

నారాయణపేట ప్రతినిధి,నమస్తేతెలంగాణ: జిల్లాలోఈ నెల15న జరుగనున్న సింగిల్ విండో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.ఇప్పటికే ఓటర్ల జాబితాలు,నామినేషన్ల దాఖలు,ఉపసంహరణలు పూర్తి చేసిన అధికారులు మిగిలిన ప్రక్రియలను పూర్తి చేసే పనులలో బిజీబిజీగా ఉన్నారు. కలెక్టర్ హరిచందన సారథ్యంలో అధికారులు ఎన్నికలను సమర్థంగా, సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
350కి పైగా సిబ్బంది నియామకం
జిల్లాలో సింగిల్ విండో ఎన్నికల నిర్వహణకు మొత్తం 350కి మందికిపైగా సిబ్బందిని నియమించి ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించారు. 10 మంది ఎన్నికల నిర్వహణ అధికారులు, ఐదుగురు జోనల్ ఆఫీసర్లు, ముగ్గురు రూట్ ఆపీసర్లను నియమించారు. మిగతా వారు ఎన్నికల ప్రక్రియ విధులను నిర్వహిస్తారు. ఎన్నికలలోపు సిబ్బందికి మరోమారు అవగాహన సమావేశాలు నిర్వహిస్తారు. ఇప్పటికే పలువురు సిబ్బంది తమతమ విధులను నిర్వహిస్తున్నారు.
87 పోలింగ్ స్టేషన్ల గుర్తింపు
జిల్లాలోని 10 సింగిల్ విండోలలలోని 130 డైరెక్టర్ స్థానాలలో తీలేరు సింగిల్ విండోలోని అన్ని స్థానాలతోపాటు జిల్లాలో మొత్తం 43స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.మిగిలిన 87 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 191మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు ఆయా సింగిల్‌విండోల పరిధిలో ఉన్న 87 ఉన్నత పాఠశాలలను పోలింగ్ ష్టేషన్లుగా ఎంపిక చేశారు. పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండగా ఎస్పీ డాక్టర్ చేతన ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
14న ఎన్నికల సామగ్రి చేరవేత
15న ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని 14న ఆయా పోలింగ్ స్టేషన్లకు చేరవేయనున్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రంలోని సిటిజన్స్క్లబ్ వద్ద ఏర్పాట్లు చేయనున్నారు. సిబ్బంది సామగ్రిని చేరవేసేందుకు వీలుగా నాలుగుఆర్టీసీ బస్సులు, 10క్రూజర్లను ఎంపిక చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నంలోపు సామగ్రి పోలింగ్ స్టేషన్లకు చేరవేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు అధికారులు ఎన్నికల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
బ్యాలెట్ల ముద్రణ ఆరంభం
ఉప సంహరణలు సోమవారం పూర్తికావడంతో బరిలో ఉండే అభ్యర్థుల వివరాలు స్పష్టమయ్యాయి. దీంతో ఎన్నికల సంఘం రూపొందించిన నిబంధనల మేరకు అధిరాకులు మంగళవారం నుంచి బ్యాలెట్ల ముద్రణకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియ బుధవారంలోపు పూర్తికానుంది. డైరెక్టర్ స్థానాలు, అభ్యర్థుల సంఖ్య తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని బ్యాలెట్ల ముద్రణ జరుగుతున్నట్లుగా అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
- కంట్రోల్డ్ బ్లాస్టింగ్ మెథడ్‌తో భవనం కూల్చివేత
- ఏపీలో కొత్తగా 118 కరోనా కేసులు
- మొదటి ప్రాధాన్యత ఓటు పల్లా రాజేశ్వర్‌రెడ్డికే
- సామాన్యుడి చెంతకు న్యాయవ్యవస్థను తేవాలి : వెంకయ్యనాయుడు
- కాయిర్ బోర్డ్ సభ్యుడిగా టిఫ్ జాయింట్ సెక్రటరీ గోపాల్‌రావు
- వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఏడుగురు నిందితులు అరెస్ట్
- 87 లక్షలు పెట్టి ఇల్లు కొని.. భారీ సొరంగం తవ్వి.. వెండి చోరీ
- ఒక్క ఉద్యోగం ఎక్కువిచ్చినా రాజీనామాకు సిద్ధం
- కొవిడ్-19పై అప్రమత్తత : రాష్ట్రాలకు కేంద్రం లేఖ!
- ఐపీఎల్- 2021కు ఆతిథ్యమిచ్చే నగరాలు ఇవేనా?