మంగళవారం 02 మార్చి 2021
Narayanpet - Feb 12, 2020 , 00:16:55

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసిన ఉపాధి హామీ ఎఫ్‌ఏలు

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసిన  ఉపాధి హామీ ఎఫ్‌ఏలు

మహబూబ్‌నగర్‌ తెలంగాణ చౌరస్తా : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వారి సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు హైదరాబాదులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఫీల్డ్‌ అసిస్టెంట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు రా ములు నాయక్‌ మాట్లాడుతూ ఉపాధి హామీలో తక్కువ పనిదినాలు పని చేసిన వారిపై వేటు వేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సరికాదని, తమ సమస్యలను పరిష్కరించడానికి మంత్రి కృషి చేస్తారని సానుకూలంగా ఉన్నారన్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా గత 14 సంవత్సరాలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకున్న వారికి ఈపీఎఫ్‌, హెల్త్‌ కార్డులు అమలు చేయాలని కోరారు. ఉద్యోగాన్ని నమ్ముకొని ఎంతో మంది గ్రామీణ ప్రాంతాల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వారి సమస్యలను ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌, హన్వాడ, కోయిలకొండ మండలాల ఫీల్డ్‌ అసిస్టెంట్లు బాబురావు, వెంకట్‌నాయక్‌, భగవంతు, రాజు, నీలియా, పాల్గొన్నారు. 

VIDEOS

logo