సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Feb 11, 2020 , 00:27:45

ఓటరు జాబితా సరి చూసుకోండి

ఓటరు జాబితా సరి చూసుకోండి

నారాయణపేట టౌన్‌ : ఈ సంవత్సరం 1-1-2020 వరకు 18 సంవత్సరాలు పూర్తయిన వారి పేర్లను ఓటరు జాబితాలో చేర్చడం జరిగిందని కలెక్టర్‌ హరిచందన అన్నారు. ఈ నెల 7వ తేదీన జిల్లాలోని గ్రామాలు, మండలాల వారిగా ఓటరు జాబితా ప్రచురించినట్లు తుది జాబితాను మీ సేవ ద్వారా తీసుకోవచ్చని, ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ హరిచందన మాట్లాడారు. నజరి నక్షా ఆన్‌లైన్‌ ద్వారా ఒక ఇంటిలో ఎంత మంది ఓటర్లు ఉన్నారన్న విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఓటరు ఐడీ కార్డు ఏపీ సిరీస్‌ నుంచి తెలంగాణ సిరీస్‌కు మార్చడం జరిగిందని చెప్పారు. మక్తల్‌ నియోజకవర్గంలో 45,436 ఓటరు నెంబర్లను, నారాయణపేట నియోజకవర్గంలో 44,750 ఓటరు నంబర్లను తెలంగాణ సిరీస్‌లోకి మార్చబడినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఆర్‌డీవో శ్రీనివాసులు, వివిధ పార్టీల నాయకులు ప్రభాకర్‌ వర్ధన్‌, మొహినుద్దీన్‌, వాసు తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo