ఘనంగా నులిపురుగుల నివారణ దినం

నారాయణపేట రూరల్ : డీ వార్మింగ్ డేను పురస్కరించుకొని సోమవారం మండల పరిధిలోని సింగారం, జాజాపూర్, తిర్మలాపూర్, కోటకొండ, కొల్లంపల్లితో పాటు పట్టణంలోని హంసవాహిని, రవితేజ, మాడ్రన్ స్కూల్ తదితర పాఠశాలల్లో నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాలలో ఆశ కార్యకర్తలు, వైద్య సి బ్బంది పాఠశాలలకు వెళ్లి మాత్రలను వేయించారు. ఈ కార్యక్రమాలలో ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయు లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
కోస్గిలో..
కోస్గి టౌన్ : జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం లో భాగంగా ఒకటి నుంచి 19 సంవత్సరాల వారికి సోమవారం నులిపురుగుల నివారణ మాత్ర లు వైద్య సిబ్బంది పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ఈ మాత్రలు పంపిణీ చేశారు. ఒక వేళ ఈ రోజు మా త్రలు వేసుకోలేక పోయిన వారు ఈ నెల 17న వేసుకోవచ్చని సూ చించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బందితోపాటు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మరికల్లో..
మరికల్ : ప్రతి ఒక్క విద్యార్ధి కచ్చితంగా ఆల్బెండజోల్ మాత్రలను వేసుకోవాలని సర్పంచ్ కస్పే గోవర్ధన్ సూచించారు. సో మవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల నులిపురుగుల నిర్ములన దినొత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆ ల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. అలాగే మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో వైద్య సిబ్బంది విద్యార్థులకు మాత్రలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీఎచ్సీ డాక్టర్ ర హమత్ ఖాన్, సిబ్బంది ఆరవిం ద్, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎం లు, ఉపాధ్యాయులు గాయత్రి, శ్రీనివాస్‌గౌడ్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
దామరగిద్దలో..
దామరగిద్ద : మండంలోని వివిధ గ్రామాలలో 2 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. క్యాతన్‌పల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ లావణ్య, జెడ్పీటీసీ లావణ్యరాములు, మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ వన్న డి ఆశమ్మ, ఈవోఆర్డి రామన్న, గడిమున్కన్‌పల్లిలో సర్పంచ్ సు భాష్, వివిధ గ్రామాలలోని పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో ఆశ, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అవుషాపూర్ మహిళల విజయాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయాలి
- ఆర్యవైశ్యులకు ఎనలేని ప్రాధాన్యం
- ఏ ఇంటి చెత్త ..ఆ ఇంట్లోనే ఎరువు..
- కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి
- కరోనా వారియర్లు నిజమైన దేవుళ్లు
- దివ్యాంగ క్రీడాకారుల కోసం..
- నేటి నుంచి 60 ఏండ్లు పైబడిన వారికి టీకా
- అబద్ధాల బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి..
- పోలింగ్‌కు ముమ్మరంగా ఏర్పాట్లు
- వాణీదేవిలోనే పీవీని చూస్తున్నాం..