బుధవారం 24 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 11, 2020 , 00:26:48

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణలు

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణలు

మద్దూరు : మండలంలోని దంగాన్‌పూర్‌ సహకార సహకార సంఘం ఎన్నికల కు సోమవారం ఉపసంహరణలు ముగిశాయి. ఈ నెల 15న నిర్వహించే ఎన్నికల కోసం ఏడు వార్డులకు గాను ఇరవై మంది అభ్యర్థులు పోటీల్లో ఉన్నారు. ఆరుగురు డైరెక్టర్లు ఏకగ్రీవం కాగా ఇందులో నలుగురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థు లు, ఇద్దరు కాంగ్రెస్‌ అభ్యర్థులు ఉన్నారు. మిగిలిన ఏడు స్థానాలకు ఈ నెల 15న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారికాళప్ప తెలిపారు. 

దామరగిద్దలో ఆరు ఏకగ్రీవం

దామరగిద్ద : మండలంలోని 13 పీఏసీసీఎస్‌ డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సోమవారం కొంత మంది అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణలు చేసుకోవడంతో ఆరు మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా ఏడు స్థానాలకు ఎన్నికలు ఈ నెల 15న జరుగునున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో మొదటి వార్డు దామరగిద్ద చెందిన పుట్టి ఈదప్ప, నాలుగో వార్డు ముస్తాపేట గ్రామానికి చెందిన చాకలి మల్లప్ప, ఆరవ వార్డు కంసాన్‌పల్లి గ్రామానికి చెందిన కోటకొండ బాలప్ప, తొమ్మిదవ వార్డు ఉల్లిగుండానికి చెందిన జీ వెంకట్‌రెడ్డి, పదో వార్డు విఠలాపూర్‌కు చెందిన టప్ప మాణిక్యప్ప, 11వ వార్డు అన్నాసాగర్‌కు చెందిన బూర్‌పల్లి చిన్న హన్మప్పలు ఉన్నారు. 

ధన్వాడలో 5 డైరెక్టర్లు ఏకగ్రీవం

ధన్వాడ : ధన్వాడ సింగిల్‌విండో ఐదుమంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 13 డైరెక్టర్‌ స్థానాలకు గాను 67 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో 37 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు. దీంతో ఐదు మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికకాగా ఎనిమిది స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా 20 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఎన్నికల అధికారులు వారికి గుర్తులు కేటాయించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో మూడో స్థానం నుంచి రూప్లానాయక్‌, 8వ స్థానంలో మోహన్‌రెడ్డి, 9వ స్థానంలో రాజు, పదో స్థానంలో భాస్కర్‌రెడ్డి, 11వ స్థానంలో  వెంకట్రామారెడ్డిలు ఉన్నారు. 

పేటలో 2 స్థానాలు ఏకగ్రీవం

నారాయణపేట : పేట మండలానికి చెందిన పీఏసీసీఎస్‌ 13 స్థానాలకు గాను రెండు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 4వ వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శేర్నపల్లికి చెందిన రాంచందర్‌, 11వ వార్డు అభ్యర్థి సుశీలమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యరు. మొత్తం 13 వార్డులకు గాను 27 మంది ఉపసంవంహరణ చేసుకోగా, ఒకరి తిరస్కరణతో 26 మంది ఎన్నికల బరి లో ఉన్నారని ఎన్నికల అధికారులు తెలిపారు.  

VIDEOS

logo