గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 09, 2020 , 03:31:37

అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలి

అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలి

మక్తల్‌ రూరల్‌ : మక్తల్‌ మండలంలో సింగిల్‌ విండో ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతో పోటీ చేసేందుకు అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి అయింది. మూడు స్థానాలు మాత్రం పెండింగ్‌లో ఉంచినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు శనివారం ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీ నాయకులతో చర్చించారు. ఆయా గ్రామాల వారీగా నివేదికలను తెప్పించుకొని గ్రామ స్థాయిలో పేరున్న రైతులను, సమర్థులను ఎన్నికల్లో పోటీ చేయించాలి నిర్ణయించారు. ఈ మేరకు మక్తల్‌ సహకార పరపతి సంఘంలో మొత్తం 13 డైరెక్టర్‌ స్థానాలకు గానూ 10 అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఎంపిక చేసిన వారికి  ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నామినేషన్‌ పత్రాలను ఇచ్చి అభినందించారు. ఎన్నికల్లో మెజార్టీ డైరెక్టర్‌ స్థానాలను గెలుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో  మక్తల్‌ మార్కెట్‌ చైర్మన్‌ నరసింహగౌడ్‌, మండల కమిటీ  అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌గుప్త, నిజాంపాషా, దత్తప్ప, ప్రతాప్‌రెడ్డి,  గోవర్దన్‌రెడ్డి, వెంకటేశ్వరెడ్డి, ఈశ్వర్‌యాదవ్‌ పాల్గొన్నారు. 

మక్తల్‌ విండోకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వీరే

 మక్తల్‌ సింగిల్‌ విండో పరిధిలో మక్తల్‌ 1వ వార్డుకు ఎరుకలి రాములు, 2వ వార్డుకు ప్యాట నర్సింహులు, 3వ వార్డుకు భాస్కర్‌రెడ్డి, 4వ లక్ష్మిరామకృష్ణారెడ్డి, 5వ వార్డుకు శేఖరరెడ్డి, 6వ వార్డుకు రామక్కోల లింగన్న, 7, 8, 9 పెండింగ్‌లో ఉన్నాయి. 10వ వార్డుకు గుడెబల్లూర్‌ నర్సింహులు, 11వ వార్డుకు మహాదేవమ్మ, 12వ వార్డుకు వెంకటప్ప, 13వ వార్డుకు దేవేంద్రమ్మలను ఎంపిక చేశారు. 

130 డైరెక్టర్‌ స్థానాలు.. 503 నామినేషన్లు

l తీలేరులో 10 స్థానాలు ఏకగ్రీవం    l 8 టీఆర్‌ఎస్‌ పరం

l దామరగిద్దలో 2, ఊట్కూర్‌లో ఒకటి ఏకగ్రీవం చేసుకున్న టీఆర్‌ఎస్‌ 

నారాయణ పేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సింగల్‌ విండో ఎన్నికల నామినేషన్ల దాఖలు ఘట్టం శనివారం ముగిసింది. జిల్లాలోని మొత్తం 10 సింగిల్‌ విండోలలో ఉన్న 130 డైరెక్టర్‌ స్థానాలకు గానూ గడువు ముగిసే సమయానికి 503 నామినేషన్లను దాఖలు అయ్యాయి. మొదటి రెండు రోజులల్లో 110 నామినేషన్లు దాఖలు కాగా, చివరి రోజు మొత్తం 393 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మూడు రోజుల్లో మొత్తం 503 నామినేషన్లు అధికారులకు అందాయి. 

అత్యధికంగా నర్వ, అత్యల్పంగా తీలేరులో...

జిల్లాలోని 10 సింగిల్‌ విండోలలో అత్యధిక నామినేషన్లు నర్వ సింగిల్‌ విండోకు దాఖలయ్యాయి. 13 డైరెక్టర్‌ స్థానాలకు గానూ ఎకంగా 72 నామినేషన్లు వచ్చాయి. అత్యల్పంగా తీలేరులో 13 డైరెక్టర్లకు గానూ కేవలం 19 నామినేషన్లు దాఖలు అయ్యా యి. నారాయణపేటలో 56, దామరగిద్దలో 34, దమగ్నపూర్‌లో 47, కోస్గీలో 55, ధన్వాడలో 67, ఊట్కూర్‌లో 37, మక్తల్‌లో 61, మాగనూర్‌లో 55 నామినేషన్లు దాఖలయ్యాయి. 

తీలేరులో బోణీ కొట్టిన టీఆర్‌ఎస్‌

జిల్లాలోని మరికల్‌ మండలంలోని తీలేరు సింగిల్‌ విండోను టీఆర్‌ఎస్‌ ఎన్నికలకు ముందె దక్కించుకొని బోణి కొట్టింది. మొత్తం 13 డైరెక్టర్‌ స్థానాలకు గానూ 10 స్థానాలకు ఒక్కొక్క అభ్యర్థి మాత్రమే నామినేషన్లను వేశారు. ఈ 10 స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. వీటిలో 8 స్థానాలను టీఆర్‌ఎస్‌, 2 స్థానాలను కాంగ్రెస్‌ దక్కించుకున్నాయి. పాలక మండలి ఏర్పాటుకు అవసరమైన స్థానాలను టీఆర్‌ఎస్‌ దక్కించుకోవడంతో తీలేరు సింగిల్‌ విండోపై మొదటి సారిగా గులాబీ జెండా ఎగరనుంది. సింగిల్‌ విండో వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్‌ అధిపత్యంలో ఉన్న ఈ స్థానం టీఆర్‌ఎస్‌ కు దక్కునుండటంతో పార్టీ శేణుల్లో నూతన ఉత్సాహం ఏర్పడింది. కాగా దామరగిద్దలో రెండు స్థానాలు, ఊట్కూల్‌లో ఒక్క స్థానానికి ఒక్కొక్కరే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇవి కూడా ఏకగ్రీవం కానున్నాయి. కాగా తీలేరులో మిగిలిన మూడు స్థానాలను  ఉపసంహరణలు ముగిసే సమయానికి ఏకగ్రీవం చేసే అవకాశాలు ఉన్నాయి.

VIDEOS

logo