మంగళవారం 09 మార్చి 2021
Narayanpet - Feb 09, 2020 , 03:30:29

హోరా హోరీగా..

హోరా హోరీగా..

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం క్రీడాఅభివృద్దికి అన్ని విధాలా కృషి చేస్తున్నదని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్‌ వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో శనివారం జిల్లాపరిషత్‌ మైదానంలో జరగుతున్న రాష్ట్ర స్థా యి ఎస్‌జీఎఫ్‌ అండర్‌ -17 బాల బాలికల టెన్నికాయిట్‌ టోర్నీకి 2వ రోజు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పోర్ట్స్‌కోటాలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. అంతర్జాతీయ క్రీ డాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అం దిస్తున్నదని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ప్రతిభ గల క్రీడాకారులకు కొదువ లేదని, ఎంతో మంది రాష్ట్ర, జాతీయ స్థాయిలో రా ణిస్తున్నారని గుర్తు చేశారు. ప్రతిభ గల క్రీడాకారులకు అన్ని వి ధాలా ప్రోత్సాహాన్ని అందిస్తామని తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో మహబూబ్‌నగర్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, రాష్టంలోని మహబూబ్‌నగర్‌ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతామన్నారు. అనంత రం క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకట్రావు, మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సిములు, మాజీ ము న్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రాములు, డీఈవో ఉషారాణి, రాష్ట్ర టీఆర్‌ఎస్‌ నాయకులు బెక్కెం జనార్దన్‌,  ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ రాజశేఖర్‌రెడ్డి, టోర్నీ ఆర్గనైజర్‌ గో టూరు శ్రీనివాసులుగౌడ్‌, వ్యా యామ ఉపాధ్యాయులు జగన్మోహన్‌గౌడ్‌, వేణుగోపాల్‌, సత్యనారాయణ, రఘు, నాగరాజు, ఉమ, అరుణజ్యోతి పాల్గొన్నారు. 

జిల్లా పరిషత్‌ మైదానంలో జరుగుతున్న అండర్‌-17 బాల, బాలికల టెన్నికాయిట్‌ టోర్నీ హోరాహోరీగా కొనసాగుతోంది. శనివారం జరిగిన టీమ్‌ చాంపియన్‌షిప్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు బాల, బాలికల విభాగంలో నల్గొండ, కరీంనగర్‌ జట్టుపై గెలిచి విజేతగా నిలిచింది. బాలికల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు, నల్గొండపై 2-0, బాలుర విభాగంలో మహబూబ్‌నగర్‌ జట్టు, కరీంనగర్‌పై 2-1 స్కోర్‌ తేడాతో గెలిచి చాంపియన్‌గా నిలిచింది. బాలికల విభాగంలో రన్నర్‌గా నల్గొండ, బాలికల విభాగంలో కరీంనగర్‌ జట్లు నిలిచాయి. బాలికల విభాగంలో సింగిల్స్‌ విభాగంలో మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, బాలుర విభాగంలో మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జట్లు ఫైనల్‌కు  చేరాయి. మూడో స్థానం టీమ్‌ చాంపియన్‌షిప్‌ విభాగంలో నిజామాబాద్‌(బాలికలు), వరంగల్‌(బాలుర) విభాగంలో నిలిచాయి. ఆదివారం  ఫైనల్‌ మ్యాచ్‌కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ము ఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు.    

VIDEOS

తాజావార్తలు


logo