రైతులను ఓట్లడిగే హక్కు టీఆర్ఎస్కే ఉంది

నవాబ్‌పేట : సహకార ఎన్నికల్లో రైతులను ఓట్లడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకే ఉం దని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సీ లక్ష్మారెడ్డి తెలిపారు. మండలంలోని కాకర్జాల, జంగమయ్యపల్లి గ్రామాల్లో శనివారం జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల వివాహ వేడుకలకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం జంగమయ్యపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారికి అండగా నిలవడం జరిగిందన్నారు. 24గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు అమలు చేసి రైతుల బతుకులకు భరోసా కల్పించారన్నారు. రైతు సమన్వయ సమితిలు ఏర్పాటు చేసి రైతులకు సేవలందించడం జరుగుతుందన్నారు. త్వరలోనే రైతు సమన్వయ సమితులను బలోపేతం చేసి పలు కార్యక్రమా లు చేపడతామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ లేక, తాగునీరు దొరకక ఎన్నో అవస్థలు పడ్డారని తెలిపారు. పంటల సాగుకు ఎరువుల కోసం రైతు లు రాత్రింబవళ్లు జాగారం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. రైతులు కూ డా వారికి మేలు చేసిన టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులకే మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు. యన్మన్గండ్ల సహకార సంఘం టీఆర్ఎస్ పార్టీ చైర్మ న్ అభ్యర్థిగా మాడెమోని నర్సిములును ప్రకటించారు. పార్టీకి పని చేసిన వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ ముత్యాల రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాడెమోని నర్సిములు, మార్కె ట్ చైర్మన్ డిఎన్ రావ్, మాజీ జెడ్పీటీసీ ఇందిరాదేవి, మాజీ ఎం పీపీ శీనయ్య, సర్పంచ్‌లు గోపాల్‌గౌడ్, యాదయ్య యాదవ్, వెంకటేష్, ఎంపీటీసీ రాధాకృష్ణ, కోఆప్షన్ సభ్యులు తాహెర్, నాయకులు నాగిరెడ్డి, పాశం గో పాల్, మెండె లక్ష్మయ్య, సంజీవరెడ్డి,పాశం కృష్ణయ్య, మల్లెపాగ నర్సిములు, మెండె శ్రీను పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఏపీలో ఘోర ప్రమాదం : ముగ్గురు మృతి
- అఫీషియల్: ఎన్టీఆర్ హోస్ట్‌గా ఎవరు మీలో కోటీశ్వరులు
- శివరాత్రి ఉత్సవాలు.. మంత్రి ఐకే రెడ్డికి ఆహ్వానం
- బండి సంజయ్‌పై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఫైర్
- 5 మిలియన్ ఫాలోవర్స్ దక్కించుకున్న యష్..!
- కాంగ్రెస్‌కు 25 సీట్లు కేటాయించిన డీఎంకే
- ప్రదీప్ హీరోయిన్ క్యూట్ పిక్స్ వైరల్
- దేశంలో కొత్తగా 18,711 పాజిటివ్ కేసులు
- హుజురాబాద్ శివారులో ప్రమాదం : ఒకరు మృతి
- మహేష్ బర్త్ డే రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్