ప్రజా ఆరోగ్యమే సీఎం కేసీఆర్ లక్ష్యం

మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం): ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వైద్యసేవలను ప్రజలకు అందుబాటులో తెస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీమైదానంలో వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ అవగాహన ర్యాలీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రావుతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం వివిధ వైద్యసేవలను ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమం సోమవారం నుంచి ఉంటుందని, తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పని సరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని సూచించారు. ఈ మాత్రలపై ఎలాంటి అపోహలు వద్దని, ప్రజలు తమ పిల్లలకు వేసుకునేందుకు ముందుకు రావాలన్నారు. 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరూ నులిపురుగుల మాత్రలు వేసుకోవాలని చెప్పారు. జిల్లాలో ఉన్న 3లక్షల మంది పిల్లలకు మాత్రలు వేసేలా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ, డీఈవో ఉషారాణి, జిల్లా మలేరియా అధికారి విజయ్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సిములు, డిప్యూటీ డీఎంహెచ్‌వో శశికాంత్, ప్రోగ్రాం అధికారులు ఉమాదేవి, సునీత, జరీనా, జిల్లా సంక్షేమ అధికారి నీలమ్మ, రెడ్‌క్రాస్ చైర్మన్ నటరాజ్, డీఎంవో పారామెడికల్ విద్యార్థులు, అంగన్వాడీలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- నా రేంజ్ మీకు తెలుసా అంటూ షణ్ముఖ్ వీరంగం..!
- రాజశేఖర్ కూతురు తమిళ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
- బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతున్న జాన్వీ కపూర్
- డేటా చోరీ గిఫ్ట్‌ల పేర బురిడీ..!
- షూటింగ్లో ప్రమాదం.. హీరోకు గాయాలు
- ఓటీపీ చెప్పండి.. కార్డు గడువు పొడిగిస్తాం..!
- రెండు రోజుల్లో.. రూ. 5లక్షలకు 4.5 కోట్లు లాభం
- రుణాల పేరుతో.. బురిడీ..
- పెండ్లి పేరుతో వల.. రూ. 10.69లక్షలు టోకరా
- బండి ఆపు.. పైసలివ్వు..!