కరోనా వైరస్‌ను తిప్పికొట్టండి

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ను పూర్తిస్థాయిలో తిప్పికొట్టేందుకు ప్రజలను పూర్తిస్థాయి లో అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వైద్యాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మహమ్మారిలా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు జిల్లా యం త్రాగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని తెలిపారు. కరోనా వైరస్‌ను నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో వ్యాధిగ్రస్తుల సర్వేను చేయాలని, రాజీవ్ గాంధీ వి మానాశ్రయం నుంచి ఎవరైనా రోగులు వ స్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే స్పం దించి చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రస్థా యి ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ అధికారుల తో సమన్వ యం చేసుకుని, రాష్ట్ర స్థాయి మానిటరింగ్ అధికారుల సూచనలతో జిల్లాలో సిద్ధంగా ఉండాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కరోనా వైరస్ కంట్రోల్ రూమ్‌ను ల్యాండ్ లైన్ సదుపాయంతో ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా జనరల్ దవా ఖానలో 25 పడకలతో కరోనా వైరస్ ఐసోలేటెడ్ వార్డు ను ఏర్పాటు చేయాలన్నారు. ఎన్-95 మాస్కులను అందుబాటులో ఉంచుకోవాలని, అనుమానిత వ్యక్తుల నుంచి శాంపిల్స్ సేకరించి గాంధీ వైద్యశాలకు పంపాలన్నారు. సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, నమూనాల రవాణాకు చర్యలు చేపట్టాలని సూచించారు. మొదటి సారిగా మన జిల్లాలో కరోనా నివారణకు సంబంధించిన ప్రచార కరపత్రాలను పంపించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖాధికారి కృష్ణ, ప్రభుత్వ జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్, ఇన్చార్జి వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నవకళ్యాణి, సంబంధిత అధికారులు ఉన్నారు.
కిసాన్ క్రెడిట్ కార్డులను అందించండి
ప్రతి రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డును అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు తెలిపారు. జిల్లాలోని రైతు కుటుంబాలు ప్రధాన మంత్రి కిసాన్ లబ్ధిదారులు ఉన్నారని, క్రెడిట్ కార్డులు లేని రైతులు వ్యవసాయ అధికారులను, బ్యాంకు మేనేజర్లను సంప్రదించి అన్సాక్సరీ-2లో వివరాలు సమర్పించినట్లు అయితే ప్రధాన మంత్రి కిసాన్ యోజన లబ్ధిదారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని తెలిపారు. అధికారులు రైతులకు అందుబాటులో ఉండి అవసరమైన సేవలు, సలహాలు అందించాలని తెలియజేశారు.
తాజావార్తలు
- వృద్ధులతో ప్రయాణమా..ఇలా చేయండి
- బీజేపీ దేశంలో విషం నింపుతుంది: శరద్‌పవార్
- ఈసారి ఐపీఎల్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
- ‘అధికారులను కర్రతో కొట్టండి’.. కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
- శ్రీశైలం.. ఆది దంపతులకు వరసిద్ధి వినాయకుడి పట్టు వస్త్రాలు
- ప్రూఫ్స్ లేకుండానే ఆధార్‌లో అడ్రస్ మార్చడమెలా
- ఈ మూడు సమస్యలే గుండె జబ్బులకు ముఖ్య కారణాలట..!
- బీజేపీలో చేరి ‘రియల్ కోబ్రా’ను అంటున్న మిథున్ దా
- రసవత్తరంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
- ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9న తొలి మ్యాచ్