శనివారం 27 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 08, 2020 , 01:06:25

చేనేతకు మరింత సహకారం

చేనేతకు మరింత సహకారం

నారాయణపేట రూరల్‌ : చేనేతకు సహకారం అం దిస్తామని, చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ హరిచందన అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ మండలంలోని కోటకొండను సందర్శించి పలువుని చేనేత కార్మికుల ఇండ్లకు వెళ్లి మగ్గాలను, చీర తయారీని పరిశీలించి వారితో మాట్లాడారు. గ్రామంలో మొత్తం 129కుటుంబాలలో చేనేత మగ్గాలు ఉన్నాయని, కార్మికులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ప్ర భుత్వం నుంచి వచ్చే స్కీమ్‌లు అమలు అయ్యే విధం గా కృషి చేస్తానన్నారు. గ్రామంలో తయారయ్యే చేనేత చీరలకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలని కోరగా ప్రయత్నిస్తామన్నారు. అలాగే చేనేత చీరల డిజైన్ల మార్పు, అమ్మకాలకు సంబంధించిన వివరాలను కలెక్టర్‌ అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహిళా సంఘాలతో సమావేశమయ్యారు. కలెక్టర్‌ వెంట డీఆర్‌డీవో కాళిందిని, చేనేత అభివృద్ధి అధికారి గోవిందయ్య, చేనేత అధ్యక్షుడు శ్రీనివాస్‌, సర్పంచ్‌ వీ జయలక్ష్మి తదితరులు ఉన్నారు. 

ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి 

మక్తల్‌రూరల్‌ : ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యం అవుతుందని కలెక్టర్‌ హరిచందన అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ మండలంలోని కాచ్‌వార్‌, లింగంపల్లి గ్రామాల్లో చేపట్టిన పల్లెప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ఎంపీపీ కార్యాలయంలో మహిళా సంఘాల సభ్యుల తో ఆయా సంఘాల పనితీరును అడిగి తెలుసుకున్నా రు. అభివృద్ధి కార్యక్రమాలలో మహిళలు భాగస్వాములు కావాలని సూచించారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీ వో రాజేందర్‌గౌడ్‌, స్పెషల్‌ ఆఫీసర్‌ హథిరామ్‌నాయ క్‌,  మక్తల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ పావని, కాచ్‌వార్‌ స ర్పంచ్‌ శేఖర్‌రెడ్డి, ఎంపీటీసీ సంగంబండ బలరాంరెడ్డి, ఏపీవో మాధవరెడ్డి, టెక్నికల్‌ అసిస్టెంట్‌ శైలజ, ఈజీఎస్‌ ఇంజినీరు మన్యం పాల్గొన్నారు.VIDEOS

logo