ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 07, 2020 , 00:44:03

అభివృద్ధిలో అగ్రగామిని చేద్దాం

అభివృద్ధిలో అగ్రగామిని చేద్దాం
  • పారిశ్రామికాభివృద్ధితో ఉపాధి కల్పిస్తాం
  • హైదరాబాద్‌లో చేనేత వస్ర్తాలు, ఆభరణాల స్టాల్స్‌
  • పర్యాటక స్థలాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం
  • ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌
  • అట్టహాసంగా పేట మున్సిపల్‌ పాలకవర్గ ప్రమాణం
  • హాజరైన ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజ

నారాయణపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలోనే నారాయణపేట జిల్లాను టాప్‌లో ఉంచేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్‌ వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కౌన్సిల్‌ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మున్సిపల్‌ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మం త్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఎమ్మెల్యే ఎస్‌ రా జేందర్‌రెడ్డి, నాయకులు, కౌన్సిల్‌ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అ నంతరం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె అనసూయచంద్రకాంత్‌, వైస్‌ చైర్మన్‌ హరినారాయణబట్టడ్‌లతో పాటు కౌన్సిలర్లు బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే ఎస్‌రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా పరిపాలించిన కాం గ్రె స్‌ తదితర పార్టీలు పరిపాలన వ్యవస్థను భ్రస్టు పట్టించాయని, 40 సంవత్సరాల పాటు ఈ మున్సిపాల్టీలో అధికారాన్ని వెలగబెట్టిన పార్టీలు అభివృద్ధిలో నారాయణపేటను అట్టడుగు తోసేశాయన్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని గత పాలకులు అవినీతి, అక్రమాలకు పాల్పడడం వల్లనే అభివృద్ధిలో ఈ ప్రాంతం కుంటుపడిందన్నా రు. మతాలు, కులాల పేరుతో విభజన లు చేసి, గొడవలు సృష్టించి తమ రాజకీయ పబ్బాలు గడుపుకున్నారు తప్ప, ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదన్నారు. 


అటువంటి పార్టీల నేతలు అభివృద్ధే లక్ష్యంగా పేదల సంక్షేమమే ధ్యే యంగా ముందుకు సాగుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించడం దొంగతనం చేసిన వాడే దొంగ... దొంగ... అని అరిచనట్లు గా ఉందన్నారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే ఓట్లు పడుతాయని భావించిన, ప్రతిపక్ష పార్టీల నాయకులకు వరుసగా జరిగిన ఎన్నికలన్నింటీలో ప్రజలు తగి న గుణపాఠం చెప్పారన్నారు. ఇటీవల ముగిసిన మున్సిపల్‌ ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించడంతో పాటు చీపుర్లు పట్టుకొని తరిమి తరిమి కొట్టినంత పని చేసినా వారికి బుద్ధి రావడం లేదన్నారు. నారాయణపేట జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర ము ఖ్యమంత్రి కేసీఆర్‌, ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌ శాఖ మంత్రివర్యులు కేటీఆర్‌తో సంప్రదించి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు, పర్యటక స్థలాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. నారాయణపేట చేనేత వస్ర్తా లు, అభరణాలకు సంబంధించి హైదరాబాద్‌లో ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.


అన్ని విధాలా అభివృద్ధి చేద్దాం..

పట్టణ ప్రజలు మనమై నమ్మకంతో అధికారాన్ని కట్టబెట్టారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అవినీతి, అక్రమాలకు దూరంగా నారాయణపేట మున్సిపాల్టీని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. 40 ఏళ్లు పా లించిన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు పట్టణాన్ని అభివృద్ధి పరంగా అధోగతి పాలు చేశారన్నారు. ఓట్లు అడుగుతుంటే ప్రజలు ఏం అభివృద్ధి ఉందని మమ్మిల్ని ఓట్లు అడుగుతున్నారని ప్ర శ్నిస్తే, వారి బాధను అర్థం చేసుకున్నా, ఇక్కడ పాలించిన పాలకులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ కుల, మ తాల పేరుతో రాజకీయలు చేయడంతో పట్టణంలో ఈ పరిస్థితులు ఏర్పాడ్డాయని గుర్తించగలిగాం. ఏళ్ల తరబడి సాధ్యం కాని, రోడ్ల విస్తరణ పనులు ఇప్పుడు సాగుతుంటే అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నది ఎవరో ప్రజలు తెలిసిందన్నారు. ప్రతి పక్ష పార్టీలు చేస్తు న్న కుట్రలను గుర్తించి తొడ గొట్టి చెప్పి న టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని, అభివృద్ధి చేస్తుందని, ఆ సవాల్‌కు అనుగుణంగా పట్టణ ప్రజలు తమ తీర్పునిచ్చి మనపై నమ్మకంతో అధికారం కట్టబెట్టారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కౌన్సిల్‌ సభ్యులందరూ పార్టీలకు అతీతంగా పట్టణ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సహాకారంతో ఈ ప్రాంతాన్ని ప ర్యాటకంగా, పరిశ్రామికంగా అభివృద్ధి చేసుకుందామని వివరించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిలను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె అనసూయ చంద్రకాంత్‌, వైస్‌ చైర్మన్‌ హరినారాయణబట్టడ్‌లతోపాటు కౌన్సిలర్లు సన్మానించారు. ఈ కా ర్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ కే వనజ, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సరాఫ్‌ నాగరాజు పాల్గొన్నారు.

VIDEOS

logo