బుధవారం 03 జూన్ 2020
Narayanpet - Feb 07, 2020 , 00:42:48

కష్టపడి చదివి అధిక మార్కులు తెచ్చుకోవాలి

కష్టపడి చదివి అధిక మార్కులు తెచ్చుకోవాలి
  • ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి
  • హాజరైన జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజ
  • రూ. 2 లక్షలు విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే

మక్తల్‌ టౌన్‌ : కష్టపడి చదివి ఉన్నత మార్కులు తెచ్చుకోవాలి అని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజ  అన్నారు. గురువారం ఉదయం 10 గంటలకు  మక్తల్‌లోని బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన పదో తరగతి ప్రేరణ తరగతుల ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే చిట్టెం, జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజ ఆంజనేయులుగౌడ్‌ మాట్టాడారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఫలితాలలో నారాయణపేట జిల్లా మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మెహన్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కష్టపడి చదవితే సాదించలేనిది ఏదీ లేదన్నారు. నెల రోజుల పాటు ప్రతి పాఠ్యాంశాన్ని క్షుణ్ణంగా చదవాలన్నారు. డీఈవో రవిందర్‌ మాట్లాడుతూ తరగతుల కోసం ఎమ్మెల్యే చిట్టెం రూ.2 లక్షల విరాళం అందజేశారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పావని, కమిషనర్‌ పావని, ఎంపీపీ వనజమ్మ, డీఎంహెచ్‌వో సౌభాగ్యలక్ష్మి, ఎంపీడీవో రాజేందర్‌గౌడ్‌, ఎంఈవో లక్ష్మినారాయణ, మైనారిటీ గురుకుల ప్రిన్స్‌పాల్‌, సిబ్బంది, పీఈటీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.logo