గురువారం 04 జూన్ 2020
Narayanpet - Feb 07, 2020 , 00:40:24

పాలమూరులో క్రీడా పండుగ

పాలమూరులో క్రీడా పండుగ
  • నేటి నుంచి రాష్ట్రస్థాయి టెన్నికాయిట్‌ టోర్నీ
  • ముస్తాబైన జెడ్పీ మైదానం
  • పాల్గొనున్న 10 జిల్లాల క్రీడాకారులు

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ మైదానం శుక్రవారం నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రస్థాయి అండర్‌-17 బాలబాలికల టెన్నికాయిట్‌ టోర్నీకి వేదిక కానుంది. ఇప్పటికే జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రస్థాయి టోర్నీకి తెలంగాణ పాత పది జిల్లాల నుంచి 100 మంది క్రీడాకారులు, 30 మంది కోచ్‌ మేనేజర్లులు, 10 అఫీషియల్స్‌ హాజరు కానున్నారు. క్రీడాకారులకు వసతి ఏర్పాట్లు చేశారు. బాలురకు మాడ్రన్‌ స్కూల్‌, బాలికలకు రెయిన్‌బో స్కూల్‌లో వసతి కల్పించనున్నారు. ఈ పోటీలను జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు, డీఈవో ఉషారాణిలు ప్రారంభించనున్నారు. ముగింపు కార్యక్రమానికి క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. 


ఏర్పాట్ల పరిశీలన

జిల్లా పరిషత్‌ మైదానంలో నేటి నుంచి జరిగే రాష్ట్రస్థాయి టెన్నికాయిట్‌ పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ రాజశేఖర్‌రెడ్డి, టోర్నీ ఆర్గనైజర్‌ గోటూరి శ్రీనివాసులుగౌడ్‌లు గురువారం పరిశీలించారు. టోర్నీకి వచ్చే క్రీడాకారులకు భోజన వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా బాలుర జట్టుకు సుజాత్‌,నవీన్‌,నరేందర్‌, భానుప్రకాశ్‌, పరుశరాం, బాలికల జట్టుకు సంధ్య, యాదమ్మ, మల్లేశ్వరి, భావని, శిరీషలు ఎంపికయ్యారని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు జగన్మోహన్‌గౌడ్‌, వేణుగోపాల్‌, దూమర్ల నిరంజన్‌, వడెన్న, సత్యనారాయణ, రాజు, రాజవర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. 


logo