శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 06, 2020 , 02:49:13

పల్లెలు పరిశుభ్రంగా ఉండాలి

పల్లెలు పరిశుభ్రంగా ఉండాలి
  • చెత్త డంపింగ్‌ యార్డుల్లోనే వేయాలి
  • అందరూ పరిశుభ్రత పాటించాలి
  • పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
  • మొగ్దుంపూర్‌లో కలెక్టర్‌ హరిచందన
  • అంగన్‌వాడీ చిన్నారులతో ఆప్యాయంగా..

ఊట్కూర్‌ : ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్‌ హరిచందన అన్నారు. బుధవారం పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఊట్కూరు మండలంలోని మొగ్దుంపూర్‌ గ్రామాన్ని కలెక్టర్‌ సం దర్శించారు. నేరుగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్న కలెక్టర్‌ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. గత 30 రోజులు, 11 రో జుల పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామంలో చేపట్టిన పచ్చదనం, పరిశుభ్రత వివరాలను కలెక్టర్‌కు స్థానికులు వివరించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. అంగన్‌వాడీ చిన్నా రుల ను ఆప్యాయంగా పలుకరిస్తూ.. ఓ చిన్నారిని భుజంపైకి ఎత్తుకున్నారు. మీకు ఏబీసీడీలు, రైమ్స్‌ వస్తాయా.. అంటూ ఆరా తీశారు. కేంద్రానికి హాజరవుతున్న పిల్లల గ్రోత్‌ రిజిస్టర్‌ను పరిశీలించి బరువులను సరిచూశారు. అంగన్‌వాడీ కేంద్రంతో పా టు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉంచిన మధ్యాహ్న భోజనం రుచి చూశారు.


ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలి

ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, వ్యక్తి మరుగు దొడ్డిని విధిగా నిర్మించుకోవాలని కలెక్టర్‌ హరిచందన మొగ్దుంపూర్‌ గ్రామస్తులకు సూచించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న మరుగు దొడ్లను ఆమె పరిశీలించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత పరిశుభ్రత ఎంత ముఖ్యమో..పరిసరాల పరిశుభ్రతను కూడా అంతే ము ఖ్యంగా భావించాలని సూచించారు. కొందరు గ్రామస్థులు అ ర్థాంతరంగా కట్టి వదిలిన మరుగుదొడ్లను వెంటనే పూర్తి చేయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డీపీవో మురళిని ఆదేశించారు. ఈజీఎస్‌ ద్వారా శ్మశాన వాటికకు వెళ్లేందుకు చేపట్టిన రోడ్డు పనులను పరిశీలించారు. గ్రామం నుండి పెద్దజట్రంకు వెళ్లే రహదారి నిర్మాణానికి నిధులు మంజూరీ చేయాలని గ్రామస్తులు కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో డీపీవో మురళి, తాసిల్దార్‌ దానయ్య, సర్పంచ్‌ సుశీలమ్మ, ఉప సర్పంచ్‌ వెంకట్రాములు, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సరోజ, పాధి ఏపీవో జయమ్మ, హెడ్మాస్టర్‌ నాగం శేఖర్‌రెడ్డి, వీఆర్‌ఏ సురేశ్‌ పాల్గొన్నారు.


ప్రతిరోజూ కేంద్రాలను సందర్శించాలి

నారాయణపేట టౌన్‌ : పదో తరగతి విద్యార్థులకు రాబోయే పరీక్షల కోసం నిర్వహిస్తున్న ప్రేరణా తరగతుల కేంద్రాలను ప్రతి రోజు అధికారులు సందర్శించాలని కలెక్టర్‌ హరిచందన సూచించారు. ఆయా కేంద్రాలలో విద్యార్థులకు ఆవాసంగా ఉండడానికి టాయిలెట్లు, మంచినీటి వసతి, విద్యుత్‌ తదితర వసతులను సమకూర్చాలని చెప్పారు. బుధవారం పట్టణంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో ప్రేరణా తరగతుల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పలు మండల కేంద్రాలలో 610 అమ్మాయిలకు కలిపి ఎనిమిది కేంద్రాలను, 539 అబ్బాయిలకు కలిపి ఏడు కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు. ఆయా కేంద్రాలలో ఆవాస వసతులను రెవెన్యూ శాఖ వారిచే జిల్లా అధికారుల పర్యవేక్షణలో నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్‌వో రవికుమార్‌, ఆర్‌డీవో శ్రీనివాసులు, డీఈవో రవీందర్‌, జిల్లా అధికారులు, తాసిల్దార్లు  పాల్గొన్నారు. 

VIDEOS

logo