బుధవారం 24 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 06, 2020 , 02:48:42

అందరూ కలిసికట్టుగా పనిచేయాలి : ఎమ్మెల్యే పట్నం

అందరూ కలిసికట్టుగా పనిచేయాలి : ఎమ్మెల్యే పట్నం

కోస్గి టౌన్‌ : కోస్గి సింగిల్‌ విండో ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ జెం డా ఎగరాలని అందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సూచించారు. బుధవారం కోస్గిలో టీఆర్‌ఎస్‌ నా యకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వమించారు. కోస్గి పీఏసీసీఎస్‌లో 13 వార్డులు ఉన్నాయని, పార్టీ నుంచి ఒకరే నామినేషన్‌ వేసేలా చూడాలని, అందరూ కలిసికట్టుగా ఉండి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోఎంపీపీ మధుకర్‌రావు, జెడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు హన్మంతురెడ్డి, నాయకులు రాజేశ్‌, శ్రీనివాస్‌, ఓం ప్రకాశ్‌, వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo