శనివారం 27 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 06, 2020 , 02:44:24

అన్నింటా గులాబీ జెండా రెపరెపలాడాలి

అన్నింటా గులాబీ జెండా రెపరెపలాడాలి

మక్తల్‌ రూరల్‌ : నియోజకవర్గంలోని అన్ని సింగిల్‌ విండోలను గెలుచుకొని గులాబీ జెండాను రెప రెపలాడించాలని మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మక్తల్‌లోని ఆయన స్వగృహంలో మక్తల్‌, ఊట్కూర్‌, మాగనూర్‌, కృష్ణ మండలాల ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించి సింగిల్‌ విండో ఎన్నికలపై చర్చించారు. సింగిల్‌ విం డో డైరెక్టర్లుగా సమర్థులతో పోటీ చేయించి, వారి విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ  సమావేశంలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షు డు మహిపాల్‌రెడ్డి, ఎల్లారెడ్డి, లక్ష్మారెడ్డి , నాయకులు మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాగనూర్‌ మండలం అడవిసత్యారం గ్రామానికి ఎమ్మెల్యే చిట్టెం ట్రాక్టర్‌ అందజేశారు. బుధవారం మక్తల్‌ పట్టణంలోని స్థానిక సోనాలికా ట్రాక్టర్‌ షోరూం దగ్గర ఎమ్మెల్యే పూజలు చేసి సర్పంచ్‌ జానకమ్మకు తా ళం చెవి అందచేశారు. అలాగే మాగనూర్‌ మండలం ఉజ్జెల్లి గ్రా మానికి చెందిన నారాయణకు సీఎంఆర్‌ఎఫ్‌ కింద రూ.60 వేల చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యురాలు చిట్టెం సుచరితారెడ్డి, మాగనూర్‌ జెడ్పీటీసీ వెంకటయ్య, వడ్వాట్‌ సర్పంచ్‌ నర్సింలు పాల్గొన్నారు. 


టీఆర్‌ఎస్‌ చేరిన నాయకులు

నర్వ : మండలంలోని పాతర్‌చేడ్‌కు పల్లె శేఖర్‌, చెన్నప్పలతోపాటు మరికొంతమంది ఎమ్మెల్యే చిట్టెం రామ్మో హన్‌రెడ్డి సమక్షంలో తెరాసాలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వారి కి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్యాంలాల్‌, సర్పంచ్‌ కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

VIDEOS

logo