ఆదివారం 07 మార్చి 2021
Narayanpet - Feb 05, 2020 , 00:29:43

మహిళలే మహారాణులు

మహిళలే మహారాణులు
  • పాలనలో మేటి.. అతివకెవరు సాటి
  • కలెక్టర్‌, ఎస్పీ, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ నారీ‘మణులే’..
  • వార్డు స్థాయి నుంచి జెడ్పీ వరకు అధికంగా..
  • మహిళల రాజ్యంగా జిల్లాకు గుర్తింపు

నారాయణపేట ప్రతినిధి/నమస్తే తెలంగాణ : నారాయణపేట అంటే భగవంతుడు.. పేట అంటే ఉండే చోటు అని అర్థం. అందుకే ఈ ప్రాంతానికి నారాయణపేట అనే పేరు వచ్చిందట. ఏడాది కిందట నూతనంగా జిల్లా ఏర్పాటు కాగా.. ప్రస్తుతం జిల్లాను నారీ పేటగా పిలుచుకునే పరిస్థితులు వచ్చాయి. వార్డు స్థాయి నుంచి జెడ్పీ వరకు.. మండల అధికారి నుంచి కలెక్టర్‌, ఎస్పీ వరకు అందరూ నారీమణులే.. అధికారులుగా, ప్రజాప్రతినిధులుగా రాణిస్తూ జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా అడుగులు వేస్తున్నారు. అవకాశం ఇస్తే పురుషులతో సమానంగా మేమూ రాణిస్తామని వారు చాటి చెబుతున్నారు. వీరిపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం. 


కలెక్టర్‌, ఎస్పీలు మహిళలే..

జిల్లాలో ప్రధాన హోదాలు అయిన కలెక్టర్‌, ఎస్పీ స్థానాల రెండింటిలోనూ ప్రభుత్వం ఇద్దరు మహిళలనే నియమించింది. ఎస్పీగా డాక్టర్‌ చేతన 8 నెలల కిందటే బాధ్యతలు స్వీకరించి సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నది. కాగా సోమవారం నూతన కలెక్టర్‌గా హరిచందన విధుల్లో చేరారు. ఇప్పటికే జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వనజ, వైస్‌ చైర్‌పర్సన్‌ సురేఖ, జెడ్పీ సీఈవో కాళిందిని కూడా నారీమణులే.. దీంతో జిల్లాకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. వీరు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. జిల్లాకు ఎన్నో సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అభివృద్ధిలో జిల్లాను పరుగులు పెట్టిస్తున్నారు. శాంతి భద్రతల విషయంలో బాగా మెరుగుపడి ప్రజలకు చేరవుతున్నారని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. వీరే కాకుండా మరో 10 మంది మహిళలు అధికారులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో జిల్లాలో వారిదే రాజ్యం. 


చైర్‌పర్సన్లు అంతా మహిళలే..

కొత్త జిల్లా మహిళలకు బాగా కలిసొచ్చింది. వార్డు స్థానాల నుంచి మొదలుకుంటే జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ వరకు ప్రధాన పదవుల్లో మహిళలే అధిక సంఖ్యలో ఉన్నారు. జిల్లాలో మొత్తం 11 ఎంపీపీ, 11 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. రిజర్వ్‌ స్థానాలతో పాటు జనరల్‌ స్థానాలలోనూ మహిళలు పోటీచేసి విజయం సాధించారు. 7 మండలాలలో ఎంపీపీలుగా, 7 మం డలాలలో జెడ్పీటీసీలుగా మహిళలే బాధ్యతలు నిర్వర్తిస్తున్నా రు. జెడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పదువులు సైతం మహిళ లే దక్కించుకున్నారు. రెండు ప్రధాన పదవులను వారే నిర్వర్తిస్తున్నారు. ఎంపీటీసీ స్థానాలలో అధిక భాగంలో మహిళలే ఉ న్నారు. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలోనూ మహిళలే మహారాణులుగా మిగిలారు. మక్తల్‌, నారాయణపే ట, కో స్గి మున్సిపాలిటీలలో అత్యధిక స్థానాలలో కౌన్సిలర్లుగా పోటీ చేశారు. నారాయణపేటలోని 24 స్థానాలలో 16 స్థానాలు, మ క్తల్‌లో 16 స్థానాలలో 11 మంది కౌన్సిలర్లుగా, కోస్గిలోని 16 సాస్థానాలకుగాను 9 స్థానాలలో వారే విజయం సా ధించారు. దీంతోపాటు మూడు మున్సిపాలిటీలకు మూడు చైర్‌పర్సన్లు, రెండు చోట్ల వైస్‌ చైర్‌ పర్సన్‌ స్థానాలను దక్కించుకున్నారు. జి ల్లాలో ఉన్న 280 గ్రామ పంచాయలలోనూ సగానికిపైగా 154 స్థానాలలో మహిళలే సర్పంచులుగా కొనసాగుతున్నారు. ఇక ఉపసర్పంచులు, వార్డు సభ్యులలోనూ వారే అధికంగా ఉన్నా రు. దీంతో జిల్లాలో అతివలదే పైచేయి అని చెప్పొచ్చు. 

VIDEOS

logo