గురువారం 22 అక్టోబర్ 2020
Narayanpet - Feb 05, 2020 , 00:21:54

పోలేపల్లి జాతరకు వేళాయే..

పోలేపల్లి జాతరకు వేళాయే..
  • - ఈ నెల 13 నుంచి 17వరకు జాతర

కోస్గి : ఈ  నెల 13 నుంచి 17వ తేదీ వరకు పోలెపల్లి ఎల్లమ్మ జాతర నిర్వహిస్తున్నట్లు పోలేపల్లి ఎల్లమ్మ జాతర ఈవో రాజేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన వివరాలను తెలియజేస్తూ ఈ నెల 13న అమ్మవారి భారీ ఊరేగింపును గ్రామంలోని దేవాలయం నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 14న సాయంత్రం 4గంటలకు సిడె కార్యక్రమం, 15న తేరు కార్యక్రమం, 16న ప్రత్యేక పూజలు, 17న భారీ ఊరేగింపు ఎల్లమ్మ ఆలయం నుంచి తిరిగి గ్రామంలోని ఆలయం వరకు నిర్వహిస్తున్నట్లు  తెలిపారు. ఈ కార్యక్రమాలతో ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. ఎల్లమ్మ భక్తులు ఉత్సవాలలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


logo