గురువారం 04 జూన్ 2020
Narayanpet - Feb 03, 2020 , 23:44:23

రైతులంతా టీఆర్‌ఎస్‌ పక్షానే..

రైతులంతా టీఆర్‌ఎస్‌ పక్షానే..

భూత్పూర్‌ : రాష్ట్రంలోని రైతులందరూ టీఆర్‌ఎస్‌ పక్షానే ఉన్నారని దేవరకద్ర ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం అన్నాసాగర్‌ గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఎన్నికలను నిర్వహించినా ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోనూ ఎంపీపీ, జెడ్పీటీసీ, రెండు మున్సిపాలిటీల్లోనూ టీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగురవేయడం శుభ సూచకమని తెలిపారు. ఈనెల 15న జరగునున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఏ కగ్రీవంగా గెలుపొందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇందుకు అవసరమై న ఏర్పాట్లను చేసుకోవాలన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్‌, నాణ్యమైన విత్తనాల పంపిణీ, ప్రాజెక్టుల ని ర్మాణం, కాలువల ద్వారా సాగునీరు ఇలా ఎన్నో రైతులకు అవసరమైన పనులను చే యడం దేశంలో తెలంగాణ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందన్నారు. సింగిల్‌విండో ఎన్నిక ల్లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలంతా కలిసికట్టుగా పని చేయాలని ఎమ్మెల్యే కోరారు. నియోజకవర్గంలోని తొమ్మిది సింగిల్‌విండోలను కైవసం చేసుకుందామని పిలుపునిచ్చారు. కా ర్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ సత్తూర్‌ బస్వరాజ్‌గౌడ్‌, మత్స్య సహకార సంఘం జిల్లా అ ధ్యక్షుడు మనెమోని సత్యనారాయణ, ఎంపీపీలు కదిరె శేఖర్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్‌, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ నర్సింహాగౌడ్‌, వైస్‌ ఎంపీపీ నరేశ్‌గౌడ్‌, మాజీ జెడ్పీటీసీ చంద్రమౌళి, నాయకులు సత్తూర్‌ నారాయణగౌడ్‌, శ్రీకాంత్‌ యాదవ్‌, జెట్టి నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌నారాయణ, గోప్లాపూర్‌ సత్యనారాయణ, అశోక్‌గౌడ్‌, వెంకట్రాములు పాల్గొన్నారు.


logo