సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Feb 03, 2020 , 23:42:14

పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం

పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం

మరికల్‌ : పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధులను చేసేందుకు ఉద యం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతుల కు హాజరయ్యే విద్యార్థులకు సోమవారం అల్పాహారాన్ని జెడ్పీ వైస్‌ చైర్‌ పర్స న్‌ గౌని సురేఖారెడ్డి, సర్పంచ్‌ కస్పే గోవర్ధన్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి నుంచి పదో తరగతి పరీక్షలు జరిగె వరకు విద్యార్థులకు ఉదయం పూట పస్తులు ఉండకుండా గ్రామానికి చెందిన సరస్వతి డీగ్రీ కళాశాల కరస్పాడెంట్‌ రాములు విద్యార్థులకు అల్పాహారం అందిస్తూండడం హర్షణీయమని అన్నారు. దాతలు సాయంత్రం కూడా అల్పాహారం అందించాలని ఉపాధ్యాయులు కోరారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రవికుమార్‌, ఎంపీటీసీ సూజా త, ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్‌ నర్సింలు, పాఠశాల హెచ్‌ఎం మధుసూదన్‌ రెడ్డి, ఉపాధ్యాయులు బాల్‌లింగయ్య, సరస్వతీ డీగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ రాములు, ఏబీవీపీ మండల కన్వీనర్‌ రాజేష్‌, యువక మండలి అధ్యక్షుడు అంజనేయులు, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాసులు పాల్గొన్నారు.

VIDEOS

logo