వైభవంగా

- కర్ని, మహాద్వార్లో ఉట్ల కార్యక్రమం
- గుంటి రంగస్వామి, గట్టు తిమ్మప్ప బ్రహ్మోత్సవాలు
- ఉత్సాహంగా పాల్గొన్న యవకులు
మక్తల్ రూరల్ : మక్తల్ మండలం కర్ని గ్రామంలో వెలసిన శ్రీ గుంటి రంగస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం సాయంత్రం 6 గంటలకు పాల ఉట్ల కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారిని ఆలయ ప్రాంగణంలో ఊరేగింపుగా తీసుకొచ్చి పాల ఉట్ల స్థంభానికి పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయ బద్ధంగా గ్రామానికి చెందిన వాకిటి గేరి యువకులు స్వామి వారి ఉట్లు కొట్టేందుకు పోటీ పడ్డారు. ఆధ్యాంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ఎట్టకేలకు వాకిటి బాలా జీ స్తంభంపైకి ఎక్కి ఉట్లు అందుకోవడంతో భక్తుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. అనంతరం స్వామివారిని ఆలయ ప్రాంగణం నుంచి పురవీధుల గుండా ఊరేగించి పల్లకీ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిన్న బాల్రామ్, ఎంపీటీసీ సభ్యుడు చిన్న రంగప్ప, ఉత్సవ కమిటీ అధ్యక్షులు దాసం శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్‌రెడ్డి, కమిటీ సభ్యులు కృష్ణయ్యగౌడ్, పురుషోత్తంరావు, చక్రధర్, లక్ష్మయ్య, పాండయ్య అర్చకులు హన్మేసాచారి, పాండు, వీఆర్ఏ విజయ్ పాల్గొన్నారు.
మాద్వార్‌లో..
మక్తల్ మండలం మాద్వార్ లో గట్టు తిమ్మప్ప స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం పాల ఉట్ల కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈసందర్భంగా స్వామి వారిని కొండపై నుంచి ఊరేగించి కిందకు తీసుకొచ్చి స్తంభం చుట్టు ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు భజన సంకీర్తనలు, పలకల కోళ్లతో ఆకట్టుకున్నారు. అనంతరం పాల ఉట్లు కొట్టేందుకు యువకులు పోటీ పడ్డారు. ఉట్టి కొట్టేందుకు దాదాపు గంటకు పైగా యువకులు ప్రయత్నించినప్పటికీ చివరి వరకు ఉట్టి అందుకోలేకపోయారు. దీంతో పాల ఉట్ల కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. చివరకు స్తంభంపైన ఉన్న వ్యక్తి ఉట్లు కొట్టడంతో కార్యక్రమం ఘనంగా ముగించారు. ఈ సందర్భంగా యువకులకు సందెపు రాళ్ల పోటీ నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవి, ఎంపీటీసీ ఇందిర, నిర్వాహకులు రాజేశ్వర్‌రావు, బాలరాజు పాల్గొన్నారు.
తాజావార్తలు
- లీటర్ పెట్రోల్ ధర రూ.100.. ఇక కామనే.. మోత మోగుడు ఖాయం
- మ్యాన్‌హోల్‌లో చిక్కుకుని నలుగురు మృతి
- ఉత్తమ రైతు మల్లికార్జున్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సన్మానం
- దేశ చట్టాలకు లోబడే సోషల్ మీడియా: అమిత్‌షా
- గల్ఫ్ ఏజెంట్‌పై కత్తితో దాడి
- సీఎం కేజ్రీవాల్ భద్రతను తగ్గించలేదు: ఢిల్లీ పోలీసులు
- బాలికను వేధించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు
- ఓయూ.. వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
- హైదరాబాద్‌లో అజిత్ సైక్లింగ్..ఫొటోలు వైరల్
- అవినీతి మన వ్యవస్థలో ఒక భాగం: మహారాష్ట్ర డీజీపీ