ఆదివారం 07 మార్చి 2021
Narayanpet - Feb 03, 2020 , 00:25:59

జూరాల నుంచి నీటి విడుదలకు సీఎం ఆదేశాలు

జూరాల నుంచి నీటి విడుదలకు సీఎం ఆదేశాలు

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : గత కొంతకాలంగా జూరాల ఎడమ కాలువకు నీటి విడుదల నిలిచిపోయిన క్రమంలో పంటలకు ఇబ్బందులు రాకుండా నీటిని విడుద ల చేయాలని ఆదివారం సీఎం కేసీఆర్‌ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, జూరాల ఎడమ కాలువకు నీటి విడుదల చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలు సీఎం కేసీఆర్‌కు విజ్ఙప్తి చేశారు. ఇటీవలే పలువురు రైతులు మంత్రికి, ఎమ్మెల్యేకు వినతి పత్రాలను అందజేశారు. ప్రధానంగా పెబ్బేరు, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లోని పంటలకు జూరాల నీరు అవసరం ఉన్నది. దీనిపై రైతులు చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న మంత్రి, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌కు వివరించడంతో నీటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కృషి చేసిన మంత్రి, ఎమ్మెల్యేలకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. 

VIDEOS

logo