పకడ్బందీగా ఆపరేషన్ స్మైల్-6

నారాయణపేట, నమస్తే తెలంగాణ : ఆపరేషన్ స్మైల్ 6లో భాగంగా ఒక్క జనవరి నెలలోనే జిల్లాలో 75మంది బాల కార్మికులను గుర్తించడం జరిగిందని, మున్ముందు బాల కార్మికులు లేని జిల్లాగా గుర్తింపు తీసుకరావడానికి కృషి చేస్తున్నామని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ డాక్టర్ చేతన కోరారు. శనివారం ఆమె ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ బాలకార్మికులను ఎవరైనా పనిలో పెట్టుకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఆపరేషన్ స్మైల్ బృందం జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రజలకు, విద్యార్థులకు బాలకార్మిక వ్యవస్థపై అవగాహన కల్పించి, కొంత మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. జనవరి నెలలో పట్టుకున్న 75 మంది బాలకార్మికుల్లో 65 మంది బాలురు, 10 మంది బాలికలు ఉన్నారని, వీరిలో 30 మంది అప్పుడే స్కూల్ మానేసి పనిలోకి వచ్చారన్నారు. వీరి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి పిల్లలను బడిలో చేర్పించామన్నారు. మిగితా 45 పిల్లలను మహబూబ్‌నగర్‌లోని స్టేట్‌హోంకు తరలించినట్లు ఆమె తెలిపారు. ఇద్దరు యజమానులపై కేసు నమోదు చేయడం జరిగిందని, 20 మంది యజ మానులకు జరిమానా విధించినట్లు చెప్పారు. వీరిలో 8 మందికి రూ.పదివేల చొప్పున, పది మందికి రూ.ఐదువేల చొప్పున, ఇద్దరికి రూ.మూడు వేల చొప్పున మొత్తం రూ.1లక్ష 36వేలను జరిమానాగా వసూలు చేసినట్లు వెల్లడించారు. బాల్యం ఎంతో విలువైందని, ఈ వయసులో వారికి తగు స్వేచ్ఛ ఇస్తూ ఆట, పాటలతో పాటుగా చదివించడం ఎంతో అవసరమన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చక్కటి వసతులతో మెరుగైన విద్య లభిస్తుందని, ప్రజలు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చక్కగా చదివించాలని సూచించారు. బాలలను పనిలో పెట్టుకున్నా, ఎక్కడైనా పనిచేసినా, తప్పిపోయినా, వదిలివేయబడిన బాలలకు సంబంధించి ఎటువంటి సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా ఆమె ప్రజలకు సూచించారు.
తాజావార్తలు
- హాట్ ఫొటోలతో హీటెక్కిస్తున్న పూనమ్ బజ్వా
- కన్యాకుమారి లోక్‌సభ.. బీజేపీ అభ్యర్థి ఖరారు
- మహేష్ బాబు కొత్త కార్‌వ్యాన్ ఇదే..!
- ఆ ఐదు రాష్ట్రాల్లోనే అత్యధికంగా కొత్త కేసులు
- మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
- కరోనా టీకా తీసుకున్న కేంద్ర మంత్రులు
- పూజా హెగ్డే లేటెస్ట్ పిక్స్ వైరల్
- షాకింగ్.. బాలుడిపై లైంగికదాడి
- 22 మిలియన్ క్యూబిక్ మీటర్ల రాళ్లు కూలడం వల్లే..
- రాజస్థాన్‌లో పాక్ చొరబాటుదారుడు హతం