శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Feb 02, 2020 , 01:27:21

చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి

చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి

నారాయణపేట, నమస్తే తెలంగాణ/నారాయణపేట టౌన్ : అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు పౌష్టికాహరం అందించాలని వార్డు కౌన్సిలర్ గురులింగప్ప అన్నారు. శనివారం పట్టణంలోని 18వ వార్డులోని అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రంలోని రిజిస్టర్లను పరిశీలించి చిన్నారుల సంఖ్య, బాలింతలకు, గర్భిణులకు అందుతున్న పౌష్టికాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. 5 సంవత్సరాలలోపు చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించాలని కోరారు. చిన్నారుల తల్లులకు గుడ్లు, బాలమృతం ప్యాకెట్లను పంపిణీ ఛేశారు. అనంతరం కుష్ఠువ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు అట్టు, నారాయణ, మొగులప్ప, అంగన్‌వాడీ టీచర్లు శైలజ, భాగ్య, వరలక్ష్మీ, ఏఎన్‌ఎం సరస్వతి, ఆశా కార్యకర్తలు లలిత, సరస్వతి చిన్నారుల తల్లులు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని 2వ వార్డు పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని కౌన్సిలర్ జొన్నల అనిత శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న బోధనలను, వసతులను పరిశీలించారు. అనంతరం హాజరు రిజిష్టర్‌ను తనిఖీ చేశారు. అంగన్‌వాడీ ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని చిన్నారులకు, గర్భిణిలకు, బాలింతలకు సక్రమంగా అందించాలని అంగన్‌వాడీ టీచర్లకు సూచించారు.

VIDEOS

logo