మంగళవారం 26 మే 2020
Narayanpet - Feb 02, 2020 , 01:05:13

ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

మహబూబ్‌నగర్ విద్యావిభాగం : విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జలజం కళాశాల డైరెక్టర్ రమేశ్‌గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హాల్‌లో జలజం జూనియర్ కళాశాల ఫెర్వాల్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని జీవితంలో ఉన్నతంగా రాణించాలని సూచించారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు నిరంతర కృషి చేయాలని తెలిపారు. కాగా, విద్యార్థినీ, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అలరించారు. అనంతరం సీనియర్ విద్యార్థులు తమ అనుభవాలను జూనియర్స్‌తో పంచుకున్నారు. అనంతరం ఇంటర్ పరీక్షల్లో జిల్లా ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, వివిధ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో శ్రద్ధ కళాశాల చైర్మన్ జగపతిరావు, లుంబిని డైరెక్టర్ లక్ష్మణ్‌గౌడ్, రిషి విద్యా సంస్థల సలహాదారు వెంకటయ్య, జలజం కళాశాల ప్రిన్సిపాల్ షకీల్, అధ్యాపకులు దేవేందర్, మహేశ్, మధుబాబు, సంజీవ్ కుమార్, ఐజాజ్ అలీ, కృష్ణ, వీరప్ప, బీంషిద్ తదితరులు పాల్గొన్నారు. 


logo