గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 01, 2020 , 01:27:07

ఉపాధ్యాయులు విద్యాప్రమాణాలు పెంచాలి

ఉపాధ్యాయులు విద్యాప్రమాణాలు పెంచాలి
  • నిష్ట శిక్షణలో జిల్లా విద్యాధికారి రవీందర్‌

మద్దూరు : ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యాప్రమాణాలు పాటించాలని డీఈవో రవీందర్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కోస్గి, మద్దూరు మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న నిష్ట శిక్షణాకార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత ఐదు రోజులుగా జరిగిన శిక్షణలో నేర్చుకున్న 50 అంశాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు నేర్పించాలని ఆయన సూచించారు. ప్రతి పాఠశాలలో విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పాఠశాలలో వందశాతం హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్‌ గోపాల్‌నాయక్‌, జీహెచ్‌ఎంలు ఆంజనేయులు, అనంతప్ప, లక్ష్మీనారాయణ, సీఆర్‌పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

VIDEOS

logo