బుధవారం 03 జూన్ 2020
Narayanpet - Feb 01, 2020 , 01:19:23

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలి

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలి

నర్వ : శాంతిభద్రతలు కాపాడేందుకు ప్రజలు సహకరించాలని ఎస్పీ డాక్టర్‌ చేతన ప్రజలకు సూచించారు. శుక్రవారం మండలంలోని పెద్ద కడుమూరులో కార్డన్‌ సెర్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా 50 మంది పోలీసులు 150 ఇండ్లను తనిఖీ చేశారు. కాగా ఎలాంటి డాక్యుమెంట్లు లేని 20 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. అనంతరం ప్రజలనుద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు రక్షణ కల్పించడం కోసమే కార్డన్‌సెర్చ్‌ నిర్వహిస్తున్నామన్నారు. గ్రామంలో ఎవరైనా కొత్త వ్య క్తులు వచ్చి షెల్టర్‌ తీసుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. అలాగే గ్రామస్తులు ఎవరూ కూడా పిల్లలను పనిలో పెట్టరాదని, వా రిని చదివించాలని సూచించారు. ప్రజ లు, మహిళలు, విద్యార్థినులు ఆపద సమయాల్లో 100కు డయల్‌ చేయాలని సూచించారు. మీ గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లు తెలిస్తే వారి గురించి వెంటనే నారాయణపేట కంట్రోల్‌ రూం ఫోన్‌ :  94924411 00 నెంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట డీఎస్పీ మధుసూదన్‌రావు, సీఐ ఇఫ్తేకార్‌ అహ్మద్‌, నర్వ ఎస్సై నవీద్‌తోపాటు కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొన్నారు.


logo