ఆదివారం 07 మార్చి 2021
Narayanpet - Jan 30, 2020 , 01:46:38

పల్లెప్రగతిపై నిర్లక్ష్యం తగదు

పల్లెప్రగతిపై నిర్లక్ష్యం తగదు

మరికల్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూన్న పల్లెప్రగతి పనులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వెంకట్రావు అధికారులను, సర్పంచులను హెచ్చరించారు. బుధవారం మండలంలోని రాకొండలో పల్లెప్రగతి పనులను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో కలెక్టర్‌ మాట్లాడుతూ రాకొండ గ్రామానికి రూ.17లక్షల నిధులు వచ్చాయని, కానీ ఇక్కడ ఒక్క పని కూడా మొదలు పెట్టకపోవడం ఏంటని సర్పంచ్‌, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పంచాయతీలకు నిధులు లేక ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుతం నెలనెలా నిధులు ఇస్తున్నా అభివృద్ధి పనులు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. గ్రామసభలో పాల్గొన్న గ్రామస్తులతో మాట్లాడుతూ మీ గ్రామంలో అభివృద్ధి పనులు అవసరం లేదా అని అడిగారు. రెండు నెలల్లో గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, లేదంటే పంచాయతీ కార్యదర్శికి, సర్పంచ్‌కు షోకాజ్‌ నోటీసులను జారీ చేస్తామని కలెక్టర్‌ హెచ్చరించారు. 

మొక్కలు ఎండిపోవడంపై ఆగ్రహం

ప్రతి పంచాయతీలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచాలని పదేపదే చెబుతున్నా రాకొండలో నూతన నర్సరీని ఏర్పాటు చేసిన మొక్కలు పెంచకపోవడంతో పాటు ఉన్న మొక్కలు కూడా నీరు లేక ఎండిపోవడం ఏంటనీ అధికారులను నిలదీశారు. గ్రామాలు పచ్చగా ఉండాలని నర్సరీలు ఏర్పాటు చేస్తే నర్సిరీని ఇలా చేస్తారా అని మండిపడ్డారు. రాజకీయాలు చేయకుండా గ్రామాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న గుడ్ల సైజు పెంచాలని కలెక్టర్‌ వెంకట్‌రావు ఐసీడీఎస్‌ అధికారులకు సూచించారు. నీరు విడుదల చేయండి

కోయిల్‌సాగర్‌ కాలువల ద్వారా మరో మూడు రోజుల పాటు నీరును విడుదల చేయాలని రాకొండ రైతులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్‌ వెంటనే కోయిల్‌సాగర్‌ అధికారులతో పోన్‌లో మాట్లాడి మూడురోజుల పాటు నీరు విడుదల చేయాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట గ్రామ సర్పంచ్‌ రాజు, ఉప సర్పంచ్‌ రా జేశ్వర్‌రెడ్డి, గ్రామస్తులు మల్లేష్‌, జయసింహారెడ్డి, ఆంజనేయులు, నరహరి, ఎంపీడీవో యశోదమ్మ, ఏపీఎం చం ద్రశేఖర్‌, టీఏ యాదిరెడ్డి, ఆర్‌ఐ భూపాల్‌రెడ్డి, వీఆర్‌వో మైబన్న ఉన్నారు.

VIDEOS

logo