గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 30, 2020 , 01:36:05

ప్రజా సంక్షేమమే ధ్యేయం

ప్రజా సంక్షేమమే ధ్యేయం
  • ప్రజల నమ్మకాన్ని నిలబెడుతాం
  • అభివృద్ధితో ప్రజాభిమానం సాధిస్తాం
  • పార్టీ వ్యతిరేకులపై కఠిన చర్యలు తప్పవు
  • కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
  • కోస్గిలో పౌర సన్మాన కార్యక్రమం

కోస్గి : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. కోస్గి మున్సిపాలిటీలో ప్రజలు తమపై పూర్తి విశ్వాసంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించారని ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా అభివృద్ధి పనులు చేసి వారి అభిమానాన్ని చూరగొంటామ ని అన్నారు. బుధవారం కోస్గి పట్టణంలోని ఏబీకే ఫం క్షన్‌ హాల్‌లో పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎన్నికల్లో నేను ఇచ్చిన హామీలతో పాటు గత మున్సిపల్‌ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిహామీని నెరవేరుస్తామని చెప్పారు. నూతనంగా ఏర్పడిన కోస్గి మున్సిపాలిటీని అన్ని రం గాల్లో అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికలను రూ పొందించడం జరిగిందన్నారు. మార్చిలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ కోస్గిలో పర్యటిస్తారని, నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే నిధులు మంజూరు చేశారని, ఆయన పర్యటన సందర్భంగా మరిన్ని నిధులు మంజూరు చేయించుకొని కోస్గి రూపురేఖలు మారుస్తామని చెప్పారు. కోస్గి మున్సిపాలిటీ పరిధిలో ఏ వర్గానికి ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని తమ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకుండా సం తోషంగా జీవించాలన్నదే తమ అభిమతం అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ లో ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసిన, ప్రచారం చేసిన నాయకులు, కార్యకర్తలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణను వ్యతిరేకిస్తూ తమ ఇష్టాను సారంగా వ్యవహరించిన వ్యక్తులు ఎంతటి వారైన కఠిన చర్యలు తప్ప వన్నారు. కొంత మంది టీఆర్‌ఎస్‌ పార్టీపై గెలిచి కాంగ్రె స్‌ పార్టీకి మద్దతు తెలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో వారిపై పార్టీ పరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మేకల శిరీష రాజేశ్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌ అన్నపూర్ణలను ఎమ్మెల్యేతోపాటు టీఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మధుకర్‌రావు, జెడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ సా యిలు, మాజీ ఎంపీటీసీ మేకల రాజేశ్‌,  శ్యాసం రామకృష్ణ, మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు హన్మంతురెడ్డి, దౌల్తాబాద్‌ మండల జెడ్పీటీసీ మైపాల్‌, మండల నాయకులు ఓంప్రకాశ్‌, నీలప్ప, జగదీశ్వర్‌రెడ్డి, వేణుగోపాల్‌, మాజీ మండల అధ్యక్షుడు ఎడ్ల చెన్నప్ప, నజీ ర్‌, హన్మంతు, విండో చైర్మన్‌ నర్సింలు పాల్గొన్నారు. 

VIDEOS

logo