మంగళవారం 02 జూన్ 2020
Narayanpet - Jan 29, 2020 , 01:59:16

కలిసొచ్చిన కాలం.. దూసుకెళ్లిన కారు

కలిసొచ్చిన కాలం.. దూసుకెళ్లిన కారు

  మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి/నమస్తే తెలంగాణ : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పుర పోరులో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయం సాధించి ఎన్నికలకు ము గింపు పలికింది. 2019 మొత్తం ఎన్నికల ఏడాదిగా గడవగా.. అప్పుడు అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించిన గులాబీ పార్టీ ఈ ఏడాది ప్రారంభంలోనే వచ్చిన మున్సిపల్‌ పోరులోనూ ఘన విజయం సాధించింది. అన్నింటా తిరుగులేని శక్తి తామేనని నిరూపించుకుంది. వరుస ఎన్నికల్లో విజయం సాధించి సంపూర్ణం చేసింది. గతేడాది నుంచి అన్ని ఎన్నికల్లో ఓటమి పాలవుతూ వస్తున్న ప్రతిపక్షాలు ఢీలా పడ్డాయి. వారికి ఓదార్పు కూడా లేకుండా చివరకు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధిపత్యాన్ని చాటింది. తిరుగులేని విజయాలు సాధించింది. ఇక దాదాపుగా అన్ని ముఖ్యమైన ఎన్నికలు ముగిసిపోవడంతో అభివృద్ధిపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఏ ర్పడిన మున్సిపాలిటీలను గ్రామం దశ దాటించి పురం వైపు తీసుకుపోయేందుకు టీఆర్‌ఎస్‌ సర్కారు సిద్ధమైంది. మరోవైపు పాత మున్సిపాలిటీలనూ మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. సరికొత్త ప్రణాళికలతో పురాభివృద్ధికి సన్నద్ధమవుతున్నారు.


కారుకు కలిసొచ్చిన కాలం

  2019లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకున్నా దాదాపుగా 90 శాతం మంది సర్పంచులు టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన వారే విజయం సాధించారు. గ్రామాల్లో గులాబీ పార్టీకి ఉన్న పట్టును ఈ ఎన్నికలే రుజువు చేశాయి. తర్వత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎదురేలేకుండా పోయింది. ఉ మ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాలను కైవసం చేసుకుని సత్తా చాటింది. రాష్ట్రంలో అత్యధిక మంది ఎమ్మెల్యేలను ఉమ్మడి జిల్లా నుంచి అసెంబ్లీకి పంపిన ఘనత దక్కింది. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలకు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు రెండు ఎంపీ సీట్లు కైవసం చేసుకుని ఢిల్లీలోనూ ప్రాతినిథ్యం పెరిగేలా చేసింది. పా ర్లమెంట్‌ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోడీ, కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ రాహుల్‌ గాంధీ, ఇతర జాతీయ నేతలు ఉమ్మడి పాలమూరులో చాలా చోట్ల ప్రచారం చేసినా ఫలితాలు మాత్రం వారికి నిరాశను మిగిల్చాయి. తర్వా త వచ్చిన జెడ్పీ ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలకు చుక్కలే కనిపించాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని 5 జిల్లా జెడ్పీలను సొంతం చేసుకున్నది. ప్రతిపక్షాలు ఏమీ చేయలేక చేష్టలూడిగి ఉండిపోయాయి. కనీసం వైస్‌ చైర్మన్‌ పదవి కూడా దక్కలేదు. ఇక మున్సిపల్‌ ఎన్నికల్లోనూ సేమ్‌ సీన్‌ రిపీటైంది. 17 మున్సిపాలిటీలకుగాను 15 బల్దియాలపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగిరింది. దీంతో పాలమూరుపై తనకున్న పట్టును నిరూపించుకుంది. రెండు చోట్ల ఓటమికి చిన్న చిన్న అంశాలు మాత్రమే కారణంగా చెబుతున్నారు. లేదంటే అవీ కూడా టీఆర్‌ఎస్‌ ఖాతాలోకే వచ్చేవని స్థానిక నేతలంటున్నారు. ఇంతటి ఘన విజయాలు సాధించేందుకు సీఎం కేసీఆర్‌ పాలనే కారణంగా పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృ ద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు ముఖ్యమం త్రి పట్ల జనానికి ఉన్న అభిమానం వల్లే ఇంతటి విజయాలు సాధ్యమవుతున్నాయని  విశ్లేషకుల అంచనా. ఓ పార్టీని ప్రజలు ఇంతగా అభిమానించడం గతంలో ఎప్పుడూ లేదు. కేసీఆర్‌ను జనం గుండెల్లో పెట్టుకున్నా రు కాబట్టే అన్ని ఎన్నికల్లోనూ గూలాబీ గుబాళింపు త ప్ప వేరే ఏ వాసనా ఉండటం లేదు. ఉమ్మడి పాలమూరు ప్రజలు ఒకసారి తాము నమ్మామంటే ఎంతగా ఆదరిస్తారో ఈ ఎన్నికలు నిరూపిస్తున్నాయి. 


ఇకపై అభివృద్ధే అభివృద్ధి

  వరుస ఎన్నికలతో వచ్చిన కోడ్‌ వల్ల పలు చోట్ల ఆగిన అభివృద్ధి పనులు ఇకపై ఊపందుకుంటాయి. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధిపై సర్కారు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గ్రా మాల్లో విజయవంతమైన పల్లెప్రగతి మాదిరిగానే త్వర లో పట్టణ ప్రగతిని మరింత పకడ్బందీగా ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. పట్టణాల్లో సమగ్రాభివృద్ధికి ఈ కార్యాచరణ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎక్కడ కూడా చిన్న సమస్య లేకుండా పట్టణాల రూపురేఖలు మార్చేందుకు సిద్ధమవుతోంది. డ్రైనేజీలు, రోడ్ల విస్తరణ, పారిశుధ్యం వంటి మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. కొత్త పాలక మండళ్లు వచ్చినందున ఇకపై పురాల్లో సమస్యలను గుర్తించి వెంట వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయనున్నారు. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పనిచేయని ప్రజాప్రతినిధులు సైతం జాగ్రత్త పడేలా ఉన్న ఈ చట్టం వల్ల గతంలోలా కాకుండా పురాలు ఎం తో అభివృద్ధి చెందుతాయని సర్వత్రా భావిస్తున్నారు. 


అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

  ఉమ్మడి జిల్లాలో 10 మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. వీటిలో భూత్పూరు, మక్తల్‌, కోస్గి, ఆత్మకూరు, అమరచింత, కొత్తకోట, పెబ్బేరు, వడ్డేపల్లి, ఆలంపూర్‌, కొల్లాపూర్‌ ఉన్నాయి. మక్తల్‌, ఆలంపూర్‌, కొల్లాపూర్‌ నియోజకవర్గ కేంద్రాలు కూడా. ఈ మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీ నుంచి పుర స్థాయికి చేరుకున్నాయి. పట్టణ స్థాయికి చేరుకున్న ఈ పట్టణాల్లో సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక కసరత్తు చేయనున్నట్లు సమాచారం. స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పట్టణాలు సుందరంగా రూపుదిద్దుకునేలా ప్రణాళికలు రచించనున్నారు.


ఆదాయంతో పాటు అభివృద్ధి కూడా..

  రాష్ట్రంలోనే అతి పెద్ద మున్సిపాలిటీ అయిన మహబూబ్‌నగర్‌తో పాటు మిగతా పాత మున్సిపాలిటీల అభివృద్ధిపైనా ప్రత్యేక కార్యాచరణ రూపొందించేందుకు ఏర్పా ట్లు జరుగుతున్నాయి. స్థానిక సమస్యలపైనా మేనిఫెస్టోలు విడుదలయ్యాయి. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. లోకల్‌ మేనిఫెస్టో ద్వారా జవాబుదారీతనంతో పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుందని ఎన్నికల ప్రచారంలో మంత్రు లు, ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అన్ని పదవుల్లో టీఆర్‌ఎస్‌ నేతలే ఉండటంతో జిల్లాలోని మున్సిపాలిటీలు ఒకపై అభివృద్ధిలో పరుగులు పెట్టనున్నాయి. 


ఉమ్మడి జిల్లాపై కేటీఆర్‌ శ్రద్ధ

  అసెంబ్లీ ఎన్నికల నుంచి మున్సిపల్‌ ఎన్నికల వరకు.. ఎన్నికలు ఏవైనా.. విజయం టీఆర్‌ఎస్‌ పార్టీదే. ఇక్కడి ప్రజలు ఉద్యమ పార్టీని అంతగా గుండెలకు హత్తుకొని ఆదరించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఎన్నికల ఫలితాలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ జిల్లా మం త్రులు, ఎమ్మెల్యేల వద్ద ప్రస్తావించి హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం. అందుకే ఇకపై ఉమ్మడి జిల్లాలోనే మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టనున్నారని తెలిసింది. దీంతో ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


logo