ఆదివారం 07 మార్చి 2021
Narayanpet - Jan 29, 2020 , 01:54:53

అభివృద్ధి బాటకు నిధుల మూట

అభివృద్ధి బాటకు నిధుల మూట

నారాయణపేట ప్రతినిధి/నమస్తే తెంగాణ : పల్లెలకు మరిన్ని అభివృద్ధి వెలుగులు రానున్నాయి. తెంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలు ప్రగతి పథాన పరుగులు తీసే అవకాశాలు మరింతగా మెరుగుపడ్డాయి. గ్రామాల సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు గాను ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని జిల్లాలో రెండు దఫాలుగా నిర్వహించడం, అందుకు అనుగుణంగా నిధులను విడుదల చేయడంతో పనులు ఇక చకచకా సాగనున్నాయి. 

రెండో విడతలో రూ7.77కోట్లు విడుదల

జిల్లాలో గత నెలలో  280 గ్రామ పంచాయతీలలో నిర్వహంచిన రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాకు రూ.7.77కోట్ల 54వేల రూపాయలు మంజూరు అయ్యాయి. 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ.4.78 కోట్లు, రాష్ట్ర  ఆర్థిక సంఘం ద్వారా రూ. 2.41కోట్లు, ఎస్సీ  కంపోనెంట్‌ ద్వారా రూ. 44.87లక్షలు, ఎస్టీ సబ్‌ప్లాన్‌ ద్వారా రూ.13.67 లక్షలు విడుదల అయ్యాయి. వీటితో పాటు మొదటి విడుతలో రూ. 32కోట్ల 86లక్షల 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం, ఎస్సీ కంపోనెంట్‌, ఎస్టీ సబ్‌ప్లాన్‌ ద్వారా విడుదలయ్యాయి. ఈ నిధుల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని పూర్తి కాగా మరికొన్ని అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మరిన్ని నిధులు విడుదల కావడంతో గ్రామాల సమస్యలు తీరనున్నాయి. 

ఊపందుకోనున్న పనులు

జిల్లాలో రెండు విడుతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమాలలో గుర్తించిన సమస్యలను పరిష్కరించేలా అభివృద్ధి కార్యక్రమాను చేపట్టునున్నారు. పాడుబడిన బావులను పూడ్చి వేయడం, మురుగు కాలువలను నిర్మించడం, డంపింగ్‌ యార్డులు, వైకుంఠ  ఏర్పాటు, పచ్చదనం-పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇవ్వడం వంటి పనులను చేపట్టి వేగంగా పూర్తి చేయనున్నారు. గత కొన్ని రోజులుగా అధికారులు మున్సిపల్‌ ఎన్నికలలో బిజీబిజీగా ఉండడంతో కొంత మందగించిన కార్యక్రమాలు ఇక ఊపందుకోనున్నాయి. ఎన్నికల తతంగం దాదాపుగా ముగియడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు తమ దృష్టిని అభివృద్ధి కార్యక్రమాల వైపు సారించనున్నారు. 

మున్సిపాలిటీలలో..

మున్సిపాలిటీలలోనూ కొత్త పాలకవర్గాలు కొలువుదీరడంతో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. మున్సిపాలిటీల పాలక మండలి పదవీకాలం ముగిసిన తరువాత స్పెషల్‌ అధికారుల చేతులోకి పోవడంతో అభివృద్ధి కార్యక్రమాలకు కొంత మేర ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇటీవల ఎన్నికలు ముగియడం, ఫలితాలు రావడం, నూతన పాలకవర్గాలు అధికారాన్ని చేపట్టడంతో ఇక అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకోనున్నాయి. పల్లె ప్రగతిలాగే.. పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుండడంతో అటు పల్లెలు, ఇటు పట్టణాలు సమాంతరంగా అభివృద్ధిని సాదించనున్నాయి. 

VIDEOS

logo