సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Jan 29, 2020 , 01:53:57

ప్రజలు చెత్తబుట్టలను ఉపయోగించుకోవాలి

ప్రజలు చెత్తబుట్టలను ఉపయోగించుకోవాలి

జడ్చర్ల రూరల్‌ : కోడ్గల్‌ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ కోడ్గల్‌ యాదయ్య అన్నారు. మంగళవారం మండలంలోని కోడ్గల్‌ గ్రామంలో ప్రజలకు చెత్తబుట్టల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి రోగాలు రాకుండా ఉండాలంటే గ్రామాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం ప్రతి గ్రామానికి చెత్తను తీసుకెళ్లేందుకు ట్రాక్టర్‌, రిక్షాలను అందజేస్తుందని, చెత్తను వేసేందుకు డంపింగ్‌ యార్డులు సైతం ఏర్పాటు చేస్తుందన్నారు. స్వచ్ఛ భారత్‌ చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతిలో భాగంగా ఇప్పటికే గ్రామంలో పలు అభవృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నా రు. ప్రజలు గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా మార్చేందుకు సహకరించాలని ఆయన పిలు పు నిచ్చారు. కార్యక్రమంలో మండల కోఆప్షన్‌ మెంబర్‌ ఇమ్ము, నాయకులు నవీన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ రామచంద్రయ్య, పుష్పమ్మ, నాగరాజ్‌గౌడ్‌, సుధాకర్‌, కొండయ్య, చెన్నయ్య, రామకృష్ణరెడ్డి, సాయిలు, నర్సిములుగౌడ్‌, నయ్యూం, శ్రీనివాసులు, రాంరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, పంచాయతీ కార్యదర్శి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.


VIDEOS

logo