అభివృద్ధే లక్ష్యం

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : పాలమూరు అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నానని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో టీజీవో డైరీ, క్యాలెండర్లను ఎంపీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రా రంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కులమతాలను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే వా రికి మనుగడ ఉండదన్నారు. తాను పాలమూరుకు వ చ్చి ఎన్నికల్లో నిలబడిన సమయంలో చాలా మంది ట్యాంకర్ల దగ్గర గొడవలు పడి మరణించిన సంఘటనలను చూసి చాలా బాధపడ్డానన్నారు. యేండ్ల తరబడి పాలమూరు పట్టణం అభివృద్ధికి దూరంగా ఉందని.. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి పట్టుదలతో అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నానని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారన్నారు. త్వరలో మీకు మంచి రోజులు వ స్తాయని చెప్పారు. ఉద్యోగుల చేస్తున్న కృషితోనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, అందరూ కలిస్తేనే ప్రభుత్వమన్నారు. మనం పది మందికి మంచి చేయాలనే తపనతోనే ప్రతిరోజు అడుగు బయటకు పెట్టాలని సూచించారు. అనంతరం ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ అందరికీ మంచి చేయాలన్న తపనతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పని చేస్తున్నారన్నారు. ఉద్యోగు ల సమస్యలను పరిష్కరించే సమయం వస్తుందని, అ ప్పటి వరకు సంయమనం పాటించాలని సూచించారు. ఎవరో చెప్పిన మాటలు విని ఆందోళన చేయకూడదని, మంచిని మంచితో చూడాలని తెలిపారు. టీజీవో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో టీజీవో రాష్ట్ర అధ్యక్షురాలు మమత, నాయకులు సహదేవ్, రవీందర్, బక్క శ్రీను, డీఎఫ్‌వో గంగారెడ్డి, జెడ్పీ సీఈవో యాదయ్య, రాజగోపాల్, రాజీవ్‌రెడ్డి, క్రాంతికుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అభివృద్ధిలో మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రత్యేక స్థానం
- డివైడర్‌పై నుంచి దూసుకెళ్లి లారీ ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
- ఇది ట్రైలరే.. అంబానీకి జైషుల్ హింద్ వార్నింగ్
- మద్దతు కోసం.. ఐదు రాష్ట్రాల్లో రాకేశ్ తికాయిత్ పర్యటన
- మెగాస్టార్‌కు సర్జరీ..సక్సెస్ కావాలంటూ ప్రార్ధనలు
- సైనా బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
- నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో అమిత్ షా పర్యటన
- 12 ఏండ్ల బాలిక ఖరీదు 10 వేలు!
- నేడు ప్రధాని ‘మన్ కీ బాత్’
- రేపటి నుంచి పీజీ ప్రాక్టికల్స్