పాలమూరు పురపాలికను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ : రాష్ట్రంలోనే మహబూబ్‌నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్ధి మహానగరాల సరసన నిలుపుతామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఎలాంటి మచ్చలేని వ్యక్తిత్వం ఉన్న నర్సింహులును చైర్మన్‌గా ప్రకటించామని తెలిపారు. గతంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అంటేనే క్యాంపు రాజకీయాలు చేసేవారని, అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ పదవులు ఇచ్చామన్నారు. రాజకీయాలకు అతీతంగా చైర్మన్ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీల కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా కౌన్సిలర్లకు జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగిస్తామన్నారు. మహబూబ్‌నగర్ పట్టణ అభివృద్ధికి రోజూ 20 గంటలు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. త్వరలోనే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామన్నారు. భాజాపా బావోద్వేగ రాజకీయాలు చేస్తుందే తప్ప అభివృద్ధి వారికి అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు తెలంగాణ రాష్ర్టాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తూ ముందుకు వెళ్తుంటే.. బీజేపీ మాత్రం మత రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ఇక్కడ తెరాస గెలిస్తే మరో పాకిస్తాన్ అవుతుందని, ఓ మాజీ ఎంపీ అన్న మాటల్ని ఇక్కడి ప్రజలు విశ్వసించలేదన్నారు. గత పాలనలో తాగునీటి కోసం పట్టణంలోని అక్కా చెల్లెళ్లు ఎంత ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలసన్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తాగునీటిని అందించి ప్రజలకు అండగా ఉన్నామన్నారు. కౌన్సిలర్లుగా గెలిచిన వారు వార్డుల అభివృద్ధిపై దృష్టి సారించాలని తెలిపారు. వాళ్లు ఓటు వేయలేదు. వీళ్లు ఓటు వేయలేదనే విషయాలను పక్కకు పెట్టి అభివృద్ధిపై దృష్టి సారించి ప్రజలకు సేవ చేయాలన్నారు. అందరూ సమిష్టిగా కృషి చేసి మహబూబ్‌నగర్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
- నాలుగో టెస్ట్‌కూ అదే పిచ్ ఇవ్వండి
- ఆప్‌లో చేరిన అందగత్తె మాన్సీ సెహగల్
- తాటి ముంజ తిన్న రాహుల్ గాంధీ..
- కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన రద్దు
- వెండితెరపై సందడి చేయనున్న బీజేపీ ఎమ్మేల్యే..!
- కేంద్రానికి తమిళ సంస్కృతిపై గౌరవం లేదు: రాహుల్‌గాంధీ
- ఎయిర్పోర్ట్ లాంజ్‌లో బైఠాయించిన చంద్రబాబు.. వీడియో
- అవును.. ఐపీఎల్‌కు మేం రెడీగా ఉన్నాం: అజారుద్దీన్
- ఆనంద్ దేవరకొండ మూడో సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది..!
- కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి ఈటల