బుధవారం 03 మార్చి 2021
Narayanpet - Jan 28, 2020 , 04:20:16

కోస్గి చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌ను సన్మానించిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

కోస్గి చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌ను సన్మానించిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

కోస్గిటౌన్‌ : కోస్గి మున్సిపల్‌ చైర్‌ పర్సగా ఎ్నకైన మేకల శిరీష, వైస్‌ చైర్‌ పర్సన్‌ కే అన్నపూర్ణలను సోమవారం మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిలు అభినందించారు. మొదటి సారిగా ఏర్పాటైన కోస్గి మున్సిపాలిటీని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌లుగా ఎన్నిక కావడం అభినందనీయం అన్నారు. అనంతరం కోస్గి మున్సిపల్‌ కార్యాలయం నుంచి శివాజీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ కూడలిలో నూతన చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌లతో కలిసి ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు రాజేశ్‌, హరి, ఓం ప్రకాశ్‌, జెడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, ఎంపీటీసీ పోశప్ప తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo