మంగళవారం 09 మార్చి 2021
Narayanpet - Jan 26, 2020 , 05:06:16

హంగ్‌ ఉన్నా.. టీఆర్‌ఎస్‌దే హంగామా!

హంగ్‌ ఉన్నా.. టీఆర్‌ఎస్‌దే హంగామా!
  • -తెరపైకి ఎక్స్‌ అఫీషియో ఓట్లు
  • -11 బల్దియాలను కైవసం చేసుకున్న గులాబీ పార్టీ
  • -అయిజ, కొల్లాపూర్‌ టీఆర్‌ఎస్‌ ఖాతాలోకే..?
  • -అదేబాటలో అమరచింత, మక్తల్‌, భూత్పూర్‌?
  • -కాంగ్రెస్‌ ఖాతాలో వడ్డేపల్లి మాత్రమే

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 17 బల్దియాలకు ఎన్నికలు జరుగగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మెజార్టీ పట్టణాల్లో పాగా వేసింది. 11 బల్దియాల్లో స్పష్టమైన మెజార్టీతో చైర్మన్‌గిరీలను చేజిక్కించుకున్నది. అయిజ, కొల్లాపూర్‌ మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ విజయం సాధించారు. దీంతోపాటు వారు టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చేందుకు ముందుకు వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో ఆ రెండు బల్దియాలు సైతం కారు ఖాతాలోకే వెళ్లనున్నాయి. అమరచింత, మక్తల్‌, భూత్పూర్‌లలో స్పష్టమైన మెజార్టీ రానందున ఎక్స్‌ అఫీషియో సభ్యుల ఓట్ల ద్వారా పీఠాలను దక్కించుకొనేందు కు టీఆర్‌ఎస్‌ వ్యూహరచన చేస్తున్నది. ఈ క్రమం లో వడ్డేపల్లి మినహా అన్ని బల్దియాలపై గులాబీ జెండా రెపరెపలాడనున్నది.
ఉమ్మడి జిల్లా పరిధిలో 17 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులున్నారు. 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు వీరికి తో డు క్లిష్ట పరిస్థితిలో రాజ్యసభ సభ్యుల ఓట్లను వినియోగించుకునే వీలున్నది.

వ్యూహం ఇదీ..!

అయిజలో ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ అభ్యర్థులు మె జార్టీ సీట్లు తెచ్చుకున్నారు. వీరంతా టీఆర్‌ఎస్‌ రె బల్‌ అభ్యర్థులే కావటం గమనార్హం. వారు ప్ర స్తుతం టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చేందుకు అంగీకరించినట్టు తెలిసింది. దీంతోపాటు కొల్లాపూర్‌లో మె జార్టీ స్థానాలు సాధించిన మాజీ మంత్రి జూపల్లి వర్గం సైతం టీఆర్‌ఎస్‌కే జై కొట్టనున్నది. ఈ మేర కు మాజీ మంత్రి జూపల్లి శనివారం తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ను కలిశారు. దీంతో కొల్లాపూర్‌, అయిజ సైతం టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకునే అవకాశం ఏర్పడింది. అమరచింతలో మొత్తం 10 స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ 3 స్థానాల్లో విజయం సాధించింది. సీపీఎం 2 చోట్ల గెలవగా... కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, సీపీ ఐ, ఇండిపెండెంట్‌ తలా ఓ చోట గెలిచారు. క మ్యూనిస్టులు బీజేపీతో జత కట్టే పరిస్థితి ఉండదు కాబట్టి.. టీఆర్‌ఎస్‌తో కలిసివచ్చే అవకాశం ఉన్న ది. దీనికి తోడు ఎక్స్‌ అఫీషియో ఓట్లు ఇక్కడ కీలకంగా మారనున్నాయి. మరోవైపు ఇండిపెండెం ట్లు సైతం అధికార పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశం ఉన్నందున అధికార పార్టీ గ్రాఫ్‌ మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎ న్నికైన కౌన్సిలర్లు జారిపోకుండా ఉండేందుకు అ న్ని పార్టీలు క్యాంపు రాజకీయాలు ప్రారంభించా యి. గెలిచిన కౌన్సిలర్లను క్యాంపుల్లో ఉంచి కాపాడుకుంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఒక్క వడ్డేపల్లి మినహా మిగతా అన్ని స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అం చనా వేస్తున్నారు.

గెలుపులో మంత్రులు కీలక పాత్ర..

ఉమ్మడి జిల్లాలోని 17 మున్సిపాలిటీలకు గా ను సింహ భాగం టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకోవడంలో మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ కీలకపాత్ర పోషించారు. వనపర్తి, ఆత్మకూ రు, కొత్తకోట, ఆలంపూర్‌ మున్సిపాలిటీలను కైవ సం చేసుకునడంలో మంత్రి నిరంజన్‌ రెడ్డి కీలకపాత్ర పోషించారు. స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ప్ర చారం చేసి టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించేలా కృషి చేశారు. ఇక ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్దదైన మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ కైవసం చేసుకునడంతో పాటు... పెద్ద మున్సిపాలిటీ అయిన నారాయణపేట బల్దియాలో గెలుపులో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చొరవ చూపారు. 

VIDEOS

logo