సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Jan 25, 2020 , 00:11:46

ఎల్లూరు మిషన్ భగీరథ పనులు భేష్

ఎల్లూరు మిషన్ భగీరథ పనులు భేష్

కొల్లాపూర్, నమస్తే తెలంగాణ : కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద నాబార్డు నుంచి రుణం సహాయంతో ప్రతి ఇంటికీ శుద్ధజలం నల్లాల ద్వారా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మాణం చేసిన మిషన్ భగీరథ ప్రాజెక్టు అమలు తీరును క్షేత్రస్థాయిలో శుక్రవారం కేంద్ర నాబార్డు ఉన్నతాధికారుల బృందం పరిశీలించింది. నాబార్డు నుంచి రూ.200కోట్లతో తీసుకున్న రుణంతో చేపట్టిన భగీరథ పనులు, అమలు తీరు భేష్‌గా ఉన్నాయని వారు సంతృప్తి వ్య క్తం చేశారు. దేశంలోని 18 రాష్ర్టాల నుంచి వచ్చిన నా బార్డు జనరల్ మేనేజర్లతో పాటు, కేంద్ర నాబార్డు జనరల్ మేనేజర్లు సుమారు 20మంది బృదం ప్రత్యేక వాహనాల్లో శుక్రవారం మధ్యాహ్నం 1గంటకు ఎ ల్లూరు భగీరథ ప్రాజెక్టును సందర్శించింది. ఈ ప్రాజె క్టు నిర్మాణం కోసం నాబార్డు నుంచి విడుదల చేసిన రూ.200కోట్లతో నిర్మాణం పూర్తై నల్లాల ద్వారా సరఫరా అవుతున్న రక్షిత తాగునీటి అమలు తీరు, ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలను డీఈఈ నవీన్ నాబార్డు బృందానికి క్షుణంగా వివరించారు. ఈ ప్రాజెక్టుకు రెండు కిలో మీటర్ల దూరంలో నల్లమల కొండల మధ్య శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టు మొదటి లిప్ట్‌లోని మోటర్ల ద్వా రా (తాగు, సాగునీరు) నీటిని పంపింగ్ చేసి నిండిన ఎల్లూరు రిజర్వాజయర్ నుంచి భగీరథ ఇన్‌టెక్‌వెల్‌కు చేరుతుందని వివరించారు. ఇక్కడి నుంచి సర్జూపుల్‌లోకి చేరిన నీటిని పంప్‌హౌస్ నుంచి నేరుగా గోపాల్‌పేట మండలం గౌరిదేవిపల్లి పంప్‌హౌస్‌కు, అక్కడి నుంచి గుడిపల్లిగట్టు పైకి పైప్‌లైన్ ద్వారా సర్జూపుల్‌లోకి చేరుతుందని డీఈఈ నవీన్ నాబార్డు బృందానికి వివరించారు. గుడిపల్లిగుట్టు నుంచి ప్రధాన పైప్‌లైన్ ఒకటి కల్వకుర్తి, షాద్‌నగర్ మీదుగా రంగారెడ్డి జిల్లాలోకి చేరుతుందన్నారు. మరో ప్రధాన పైప్‌లైన్ బిజినేపల్లి నుంచి జడ్చర్ల నియోజకవర్గంలోని గ్రామాలకు, బిజినేపల్లి నుంచి ప్రధాన పైప్‌లైన్ భూత్పూర్, మహబూబ్‌నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట్, కొడంగల్, వనపర్తి నియోజకవర్గాలకు రక్షిత నీరు ప్రతి ఇంటికీ చేరుతుందని ఆయన వివరించారు. ఎల్లూరు ప్రధాన మిషన్ భగీరథ ప్రాజెక్టు నుంచి మహబూబ్‌నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలోని మొత్తం 3400 గ్రామాలకు రక్షిత నీటిని అందిస్తున్నట్లు నాబార్డు బృందానికి క్షుణంగా ఆయన చెప్పారు. దీంతో సదరు బృందం సంతృప్తిని చెందారు. ఆ తరువాత ఆ బృందం ప్రాజెక్టులోని పంప్‌హౌస్‌లో రన్నింగ్‌లో ఉన్న మోటర్లు పనిచేస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు నమూనా మ్యాప్‌తో పాటు ఫొటో ఎగ్జిబిషన్‌ను నాబార్డు బృందం పరిశీలించింది. దీంతో భగీరథ పనులు భేష్ అని బృందం సభ్యులు కితాబు ఇచ్చారు. అనంతరం గోపాల్‌పేట మండలం గౌరిదేవిపల్లి, గుడిపల్లిగట్టు వద్ద భగీరథ పనుల పరిశీలనకు వెళ్లారు. వారి వెంట మిషన్ భగీరథ స్థానిక ఈఈ సుధాకర్‌సింగ్, డీఈఈ అంజత్ పాషా, ఏఈలు మల్లేశ్వర్‌రావు, విజయ్, సాధిక్, వెంకటేశ్వర్‌రావు ఉన్నారు. 

VIDEOS

logo