సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Jan 25, 2020 , 00:11:03

డ్రైవింగ్‌లో ఏకాగ్రత ఎంతో అవసరం

డ్రైవింగ్‌లో ఏకాగ్రత ఎంతో అవసరం

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : డ్రైవర్లకు డ్రైవింగ్ చేసేటప్పుడు ఏకాగ్రత ఎంతో అవసరం అని, వారి మనసు ప్రశాంతంగా ఉంటేనే ప్రయాణికులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుస్తారని ఆర్‌ఎం ఉషాదేవి, ఎంవీఐ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో డ్రైవర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్రైవర్ల దినోత్సవ వేడుకలను వివిధ రూపాల్లో కొనసాగించి డ్రైవర్ల ప్రాముఖ్యతను అందరికీ తెలిసేలా అధికారులు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు పెన్నులు, పువ్వులు అందజేసి శుభాకాంక్షలు తెలియజేస్తు ఉత్తమ డ్రైవర్లుగా ఉండాలని పలువురు విద్యార్థులు, అధికారులు కొరారు. అనంతరం డిపో ఆవరణంలో డ్రైవర్ల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డిపో ఆవరణలోనే విద్యార్థులు మానవహారం నిర్వహించి డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా  ఆర్‌ఎం ఉషాదేవి, ఎంవీఐ శ్రీనివాస్‌రెడ్డిలు మాట్లాడుతూ డ్రైవర్లకు ఎన్ని ఒత్తిడులు ఉన్నా వాటిని పక్కకు పెట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకొని డ్రైవింగ్ చేసి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చాలన్నారు.  అలా చేయగలిగితేనే ఆర్టీసీ సంస్థ ను కూడా మనం కాపాడుకున్న వారమవుతామని చెప్పారు. అనంతరం ఉత్తమ డ్రైవర్లు భీమయ్యగౌడ్, అమీద్‌అలీలను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ డిపో మేనేజర్ అశోక్‌రెడ్డి, కేఆర్ రెడ్డితోపాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు. 

VIDEOS

logo