పదిలో వందశాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలి

- సమీక్షా సమావేశంలో జిల్లా విద్యాధికారి రవీందర్
మద్దూర్ : పదో తరగతిలో వందశాత ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో విద్యా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఉన్నత పాఠశాలలు ఉన్న గ్రామా ల్లో ఆయా గ్రామా సర్పంచులు, ఎంపీటీసీలు పాఠశాల కు విద్యార్థులు వందశాతం హాజరయ్యే విధంగా కృషి చేయాలని సూచించారు. పదో తరగతి ఫలితాల్లో ఈ యేడాది ప్రథ మ స్థానంలో నిలపాలని, అందుకు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు క ల్పిస్తున్నా ప్రైవేటు పాఠశాల వైపు ఎందుకు చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం నుంచి పుస్తకాలు, యూనిఫామ్స్, మధ్యా హ్న భోజనంతోపాటు మెరుగైన విద్యను అందిస్తున్నదని చెప్పారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉదయం, సాయంత్రం వేళల్లో స్నాక్స్ కూడా ఇస్తున్నామని ఈ అవకాశాలను విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. ఉపాధ్యాయులు పదో తరగతి విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చ ర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, ఎంపీడీవో కాళప్పతోపాటు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- సురభి వాణీ దేవిని గెలిపించుకోవాలి : మంత్రి హరీశ్
- బెంగాల్ పోల్ షెడ్యూల్ : ఈసీ నిర్ణయంపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం
- రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో స్టార్ క్రికెటర్లు
- లొల్లి పెట్టొద్దన్నందుకు తల్లీకొడుకుకు కత్తిపోట్లు
- ఇలా చేస్తే రైతులు దిగి వస్తారన్న బాబా రాందేవ్
- అంబాసిడర్ కంపెనీ ఫర్ సేల్!
- రైలు ట్రాలీని తోసుకుంటూ ఉ.కొరియాను వీడిన రష్యా దౌత్యాధికారులు
- కలెక్షన్స్‌కు 'చెక్'..నిరాశలో నితిన్
- నవరత్నాలను కాపీకొట్టిన టీడీపీ..విజయసాయిరెడ్డి సెటైర్లు
- తొండంతో ఏనుగు దాడి.. జూ కీపర్ మృతి