శుక్రవారం 29 మే 2020
Narayanpet - Jan 25, 2020 , 00:05:00

కొడాపూర్‌ను సందర్శించిన అధికారులు

కొడాపూర్‌ను సందర్శించిన అధికారులు

ధన్వాడ : కొండాపూర్ గ్రామంలో చాలా మంది చిన్నారులు డెంగీ వ్యాధితో ఆస్వస్థతకు గురి కావడంతో శుక్రవారం అధికారులు గ్రామంలో పర్యటించారు. జిల్లా వైద్యాధికారి సౌభాగ్యలక్ష్మి, ఎంపీడీవో శశికళ, ఇన్‌చార్జి తాసిల్దార్ గాయత్రి,  ఆర్‌ఐ శ్రీనివాసులు, వై ద్యాధికారి వెంకట్, సిద్దప్ప గ్రామంలో పర్యటించి పలు వీధులు మురుగు నీరు నిలిచి ఉం డడాన్ని గుర్తించారు. ఇలా మురుగునీరంతా ఎక్కడికక్కడ నిలిచి ఉంటే దోమలు రావా ? రోగాలు రావా అని డీఎంహెచ్‌వో స్థానిక ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులతోపాటు ప్రజలు కూడా ఎవరికి వారు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచు కుంటే ఎలాంటి రోగాలు మన దరిచేరవన్నారు. అనంతరం అస్వస్థతకు గురైన వారి ఇంటి కి వెళ్లి అస్వస్థతకు గల కారణాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఇండ్ల నుంచి వచ్చే మురుగు నీళ్ళు  నిల్వ ఉండటం వల్ల దోమలు పెరిగిపోతయని వైద్యాధికారి ఆందోళన వ్యక్తం చేశారు. మా పరంగా అందరికి వైద్యం అందిస్తాం.. కానీ మీరు గ్రామాన్ని పరిశుభ్రం గా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. 


logo